Category ఎడిటోరియల్

సామాన్యుల‌పై మ‌ధ్య‌ప్రాచ్య యుద్ధ మంట‌ల భారం!!

ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయిల్ ల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం ఎంత‌కాలం కొన‌సాగుతుందో తెలియ‌డంలే దు. దీనివ‌ల్ల మ‌ధ్య‌ప్రాచ్యాన్ని యుద్ధాగ్నిజ్వాల‌లు ద‌హించి వేస్తుంటే, ఇంధ‌నంపైనే ఆధార‌ప‌డిన మాన‌వ పురోగ‌తి ఇప్పుడు చ‌మురు సంక్షోభాగ్నిలో విల‌విల‌లాడుతోంది. ఇరాన్‌ను తేలిగ్గా లొంగ‌దీసుకోవొచ్చ‌నుకున్న ట్రంప్‌కు ఇప్పుడు ఇరాన్ స‌త్తా ఏంటో తెలిసొస్తున్నది . త‌ర్వాతి కాలంలో లొంగుతుందా లేదా అన్న‌ది త‌ర్వాతి సంగ‌తి,…

మూసీ మురుగులో మున‌క‌లేస్తున్న రాజ‌కీయం..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మూసీన‌ది పునరుద్ధ‌ర‌ణ అంశంపై విప‌క్షాల‌కు, ప్రభుత్వానికి మ‌ధ్య ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌ల ప‌ర్వం ప‌తాక‌స్థాయిలో జ‌రుగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌రుగనున్న నేప‌థ్యంలో విప‌క్షాల‌కు మూసీ పున‌రుద్ధ‌ర‌ణ ప్రాజెక్టు పెద్ద అస్త్రంగా మారింది. ఇందులో భాగంగానే బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా ప్ర‌భుత్వం 1.5ల‌క్ష‌ల ఇళ్ల‌ను ఈ ప్రాజెక్టుకింద కూల‌గొ…

భయపెడుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మార్చి మాసం ఆరంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తీవ్ర వేడి కేవలం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని…

రాష్ట్రంలో జ‌న‌గ‌ణ‌న తొలిద‌శ‌!

The first phase of cast census in telangana state!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత మొట్ట‌మొద‌టిసారి జ‌న‌గ‌ణ‌న తొలిద‌శ ఈ ఏడాది మే 11న ప్రారంభం కానుంది. ఈ ద‌శ‌లో  గృహాల వివ‌రాలు సేక‌రించి జాబితాను త‌యారుచేయ‌నున్నారు. ఈ గృహ జాబితా త‌యారీ కార్య‌క్ర‌మం (హెచ్ ఎల్‌ ఓ) 9వ‌ర‌కు కొన‌సాగనుంది. అయితే ఈ హెచ్‌ ఎల్ ఓ ప్రారంభానికి 15 రోజుల ముందు అంటే…

త్రిశంకు స్వ‌ర్గంలో ప్ర‌జ‌ల ర‌థం!!

టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం 21 డిమాండ్ల జాబితాను ప్ర‌భుత్వానికి అంద‌జేయ‌డం తాజా ప‌రిణామం. ముఖ్యంగా ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల మేర‌కు త‌మ‌కు చెల్లించాల్సిన ఆర్థిక బ‌కాయిల చెల్లించాలన్న‌ది సిబ్బంది చేస్తున్న ప్ర‌ధాన డిమాండ్‌. గ‌త ఏడాది మొద‌ట్లో కూడా ఆర్టీసీ సిబ్బంది త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ముందుకు తెచ్చి అమ‌లు చేయ‌క‌పోతే 2025…

మ‌న దౌత్యానికి అగ్ని ప‌రీక్ష‌!

అమెరికా ఆధిప‌త్య ధోర‌ణి విప‌రీతంగా పెరిగిపోయి ఏకంగా దేశాధ్య‌క్షుల‌ను అరెస్ట్ చేయ‌డం లేదా అంతమొందించడం  వంటి ప‌నుల‌కు పాల్ప‌డుతుండ‌టం ఆయా దేశాల వ్య‌వ‌స్థ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. ప్ర‌పంచ బాస్‌ను తానేన‌న్న అహంకారంతో అమెరికా, మ‌రో దేశంలో చ‌ట్ట‌బ‌ద్ధంగా అధికారంలో ఉన్న  మ‌రో ప్ర‌భుత్వా న్ని త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కోసం కూల్చి త‌న‌కు అనుకూల ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు…

విద్వేష బిల్లుపై భిన్న స్వరాలు

తెలంగాణ శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన హేట్‌ ‌స్పీచ్‌ ( ‌విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు-2026పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇది వాక్‌స్వాతంత్య్రాన్ని హరించేదిగా ఉందని, తప్పు ఒప్పులను నిర్ణయించే విషయంలో ఈ బిల్లులో స్పష్టత లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని అధికార వర్గాలు దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ముఖ్యంగా తమకు వ్యతిరేకమైన వారిపైన ప్రతీకార…

చ‌మురుపై ఆధిప‌త్యం కోసం తెగ‌బ‌డ్డ ట్రంప్‌!

Trump Determined to Dominate Global Oil Politics

అంతా అనుకున్న విధంగానే ఇజ్రాయిల్‌, అమెరికాలు ఉమ్మ‌డిగా శ‌నివారం ఇరాన్‌పై దాడుల‌కు దిగాయి. ఈ దాడుల‌కు ఇజ్రాయిల్ “ఆప‌రేష‌న్ లైన్ రోర్” అని పేరు పెడితే అమెరికా “ఆప‌రేష‌న్ ఎపిక్ ఫ్యూరీ” అని నామక‌ర‌ణం చేసింది. మ‌రోవైపు పాకిస్తాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌ల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న త‌రుణంలో మ‌ధ్య ప్రాచ్యంలో పోరు మొద‌లు కావ‌డం ప్రపంచ దేశాల‌ను…

కుమ్మెర సంఘ‌ట‌న ఒక సామాజిక పాఠం 

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా  కుమ్మెర ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ సంఘటనలో ఒక కుటుంబంపై జరిగిన దాడి అనంతరం, రెండు నెలల పసికందు మరణించడం తీవ్ర…