రేవంత్ గురించి మంచి చెప్పడానికి ఏముంది?
•తెలంగాణ భవన్‌లో కెటిఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి
నీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డినే బ్యాగ్‌లు మోసి పైకి వొచ్చాడని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డిని బండ బూతులు తిడుతున్నారు.. రైతు బంధు ఎవరికీ పడడం లేదు అని తిడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు టింగ్ టింగ్ మని పడేవి అని చెబుతున్నారు.. అందుకే రేవంత్ రెడ్డికి టింగ్ టింగ్ అనే పదం పడదని విమర్శించారు. అందుకే టకీ టకీ మని రైతు భరోసా పడుతుంది అంటున్నాడు.. ఎక్కడ చూసినా రైతు భరోసా పడట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఫాం హౌస్‌లు ఎవరికీ లేవు లోకం మీద.. నాకు ఒక్కడికే ఉన్నట్లు చెబుతున్నారు.. జెన్వాడలో ఉన్న తన కోసమే హైడ్రా ఏర్పాటు చేశారని కేటీఆర్ ఆరోపించారు.
మరోవైపు.. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ మండిపడ్డారు. వేగంగా కమీషన్ల కోసం పనులు స్టార్ట్ చేశారు.. ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఒక మంత్రి చేపలు తిందాం అంటాడు.. ఇంకో మంత్రి నీళ్లు వాటర్ కలవడం వల్ల జరిగింది అంటున్నాడు.. ఇలాంటి మంత్రులు ఉన్నారని దుయ్యబట్టారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి కారణం కేసీఆర్ అని అంటున్నారు.. అధికారం కోల్పోయి ఇన్ని నెలలు అయినా కేసీఆర్ అనే అంటున్నారని పేర్కొన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికలు అయినా.. పార్లమెంట్ ఎన్నికలు అయినా గులాబీ జెండానే ఎగురుతుందని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్లు వొచ్చి మాయమాటలు చెబుతారు.. ఇంకోసారి అసలు మోసపోవద్దని కేటీఆర్ పేర్కొన్నారు.