కాకతీయ కలగూర గంప – 17
పాల్వంచలో బీ హెచ్ ఇ ఎల్ ప్రాజెక్ట్ నిర్మాణ కార్య క్రమంలో ప్రతి రోజూ పని ప్రోగ్రెస్ ను గమనిస్తూ నిర్దిష్ట కాల పరిమితిలో పని జయప్ర దంగా ముగించడానికి ప్రయ త్నించేవాళ్ళం. ప్రతి ఆదివారం కూడా పని జరిగేది. అధిక పీడన వెల్డింగ్ పని కాబట్టి ప్రత్యేక ‘టంగ్స్ టన్ ఇనర్ట్ గేస్ (టిగ్) వెల్డింగ్ ‘పద్ధతి వుండేది. అన్ని జాయింట్లు కూడా ‘ఎక్స్ రే ‘పరీక్షలు చేయడానికి ‘ఎక్స్ రే ల్యాబ్’ కూడా వుండేది.

1978 లో న్యూ ప్రాజెక్ట్ హాస్టల్ వరండాలో మేము
– నిరంజన్ రావు, విజయ రాఘవన్, రామచంద్ర రావు,
రాజ రత్నం (ఎడమవైపు నుండి)
ఇదే సమయం లో 1974-75 లో నెలకొల్పిన 110 మెగావాట్ల 5, 6 యూనిట్ల కెపాసిటీని 120 మెగావాట్స్ కు పెంచే పునరుద్ధరణ కార్యక్రమం చేబట్టారు. దానిలో కూడా నాకు థర్మల్ ఇన్సులేషన్ పని అప్పగించారు. 1978 డిసెంబర్ వరకు నిర్మాణ క్రమం పూర్తై సిద్ధంగా వున్న 8 వ యూనిటుకు అతి పీడన ‘హైడ్రాలిక్ టెస్ట్’ నిర్వహించడానికి నిర్ణయిం చబడి ంది. ఐతే అది ప్రభుత్వ బాయిలర్ ఇన్స్ పెక్టర్ సమక్షంలో చేసి సర్టిఫికేట్ పొందాలి కాబట్టి హైదరాబాద్ లోవున్న బాయిలర్ ఇన్స్ పెక్టర్ ను తీసుకొనిరావడానికి నేను కారు తీసుకొని హైదరాబాద్‌కు వెళ్ళి నాతో బాటు ఆయనను కారులో పాల్వంచ కు తీసుకు వచ్చి మా రెసిడెంట్ ఇంజినీరు గారితో కలిపాను.

అప్పుడు మేమున్న న్యూ ప్రాజెక్టు హాస్టల్ ఇప్పుడు
(6 నెలల క్రితం ఫోటో)
అప్పటి సినిమా థియేటర్, ఇప్పుడు ఏసి థియేటర్
ఆ పరీక్ష జయప్రదంగా ముగిసాక 1979 ఫిబ్రవరిలో అనుకుంటా 8వ యూనిటును జయప్రదంగా ప్రారంభించి గ్రిడ్ కు కలిపారు. పనులు దాదాపు ముగిసాయి కాబట్టి ఒక్కొక్కరిని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయడం మొదలైంది. నాకు ఒరిస్సాలో నిర్మాణంలో వున్న ‘తాల్చేర్ థర్మల్ పవర్ స్టేషన్ ‘ కు బదిలీ ఐంది. మా రెసిడెంట్ ఇంజినీర్‌ను, మరి కొందరిని గుజరాత్ లోని ‘వనక్ బరీ థర్మల్ పవర్ స్టేషన్’ కు బదిలీ చేసారు.
ఐతే నిర్మాణ క్రమంలో కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయిన చిన్న చిన్న పనులున్నాయి. కాబట్టి మా రెసిడెంట్ ఇంజినీరును రిలీవ్ చేసి నన్ను రెసిడెంట్ ఇంజినీరు గా నియమించి నాతో బాటు వెల్డింగ్ ఇంజినీరు ను, ఇద్దరు హెచ్ పీ వెల్డర్లను కూడా పాల్వంచలో నే ఆపేసి మిగతా అందరినీ రిలీవ్ చేసారు. మొత్తం 82 దాకా పెండింగ్ పనులున్నాయి. వీటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ బోర్డ్ ఇంజినీర్ల ద్వారా పని పూర్తైనట్లు సర్టిఫికేట్ తీసుకునేవాన్ని. ఇక పోతే స్టోర్స్ యార్డ్ లో చాలా మిగిలిపోయిన భాగాలు వుండేవి. అట్లాగే గదులు ఖాలీ చేసి బదిలీపై వెళ్ళిపోయిన బీ హెచ్ ఇ ఎల్ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగుల ఇండ్లలో వున్న మంచాలు, పరుపులు, కుర్చీలు, సోఫాలు, విద్యుత్ ఫ్యానులు, ఎయిర్ కూలర్లే కాకుండా, మా రెసిడెంట్ మరియు ఇతర సీనియర్ ఇంజినీర్ల ఇంట్లో వుండే మూడు ఎయిర్ కండిషనర్లు, మూడు రిఫ్రిజిరేటర్ లు వున్నాయి. వీటి లిస్ట్ తయారు చేసి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫేనులు, మూడు డైనింగ్ టేబుళ్ళు అప్పుడే పని ప్రారంభించిన ‘విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్’ లోని బీ హెచ్ ఇ ఎల్ ఆఫీస్ కు పంపించి మిగతావి ఇక్కడే వేలం వేసి అమ్మేయడానికి మా హెడ్ ఆఫీసు అనుమతి తీసుకొని ఆ కార్యక్రమం ముగి ంచాను. యార్డ్ లో మిగిలిపోయిన ముఖ్యమైన వాటిని కూడా వీ టీ పీ ఎస్ కు తరలించాము.
ఒక సంవత్సరం తర్వాత నేను 1978 నవంబర్లో ‘సీ’ క్వార్టర్స్ నుండి న్యూ ప్రాజెక్ట్ హాస్టల్ కు మారాను. నేను, రామచంద్రరావు రూం నంబర్ 10 (‘దస్ నంబరీ’) లో వుండేవాళ్ళం. 3వ నంబర్ గదిలో రాజరత్నం దంపతు లుండేవాళ్ళు. ఆయన కేరళ వాసి. 7వ నంబర్ గదిలో కొత్తగా వచ్చిన మా అక్కౌంట్స్ ఆఫీసర్ కృష్ణమూర్తి వుండేవాడు. మిగతా గదుల్లో కే టీ పీ ఎస్ ఉద్యోగులుండే వారు. ప్రాజెక్ట్ హాస్టల్ లోనే బెనర్జీ రెస్టారెంట్ వుం డేది. భోజన వసతి వుండేది. మె యిన్ రోడ్ మీదనే వున్న శ్రీ వెంకటేశ్వర టాకీసు 5 నిమిషాల నడక. పాల్వంచలోనే ఏ పీ స్టీల్స్ లో స్టెనో గ్రాఫర్ గా పనిచేస్తున్న మా వరంగల్ మిత్రుడు మోహన్ తో కలిసి అక్కడ సినిమాలు చూసేవాణ్ణి.
‘మిస్సమ్మ ‘పాత సినిమా 6 సార్లు చూసాం. ఇక కొత్తగూడెం వైపు, అటు భద్రాచలం పోయే బస్సులు హాస్టల్ ముందే ఆగేవి. హాస్టల్ నుండి 5 నిమిషాలు భద్రాచలం వైపు నడిస్తే విద్యుత్ బోర్డ్ వారి గెస్ట్ హౌజ్ వుండేది. హైదరాబాద్ నుండి అప్పటి ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ బోర్డ్ చైర్మన్ నార్ల తాతారావు గారు వస్తే అక్కడే వుండేవారు. గెస్ట్ హౌస్ దాటితే భద్రాచలం పోయే రోడ్డు రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లతో అడవి లాగా వుండేది. 1979 జూన్ మాసంలో రామచంద్ర రావు కూడా ‘వనక్బరి థర్మల్ పవర్ ప్రాజెక్ట్’ కు ట్రాన్స్ ఫర్ అయ్యాడు. (మంగళవారం,ఫిబ్రవరి 4 సంచికలో ..’’ పాల్వ ంచలో’ కేటిపీఎస్ సాంస్కృతిక సంస్థ సమావేశంలో ‘సురవం ప్రతాప రెడ్డి జీవిత విశేషాల’పై ఇందుర్తి ప్రభాకర రావు ప్రసంగం)
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు