సదాలోచనలకు మేల్కొలుపులు…
అంతరాళాల్లోకి దూసుకెళ్ళే కవిత కలకాలం బ్రతుకుతుంది. ఆలోచనలను కలిగించి ఎదల్ని కదలించే కవిత్వానికి సార్థకత దక్కుతుంది. తాడేపల్లి హనుమత్ ప్రసాద్ పదిహేడేళ్ల చిన్నతనంలోనే కవితా రచనను ప్రారంభించి సంకీర్తనా స్రవంతి, ధన్య జీవి మా నాన్న, మా మంచి అమ్మ, మేలుకొలుపు, గగనం తాకుతు ఎగిరింది అన్న రచనలను తెలుగు సాహిత్యానికి అందించారు. అంతరంగ ప్రభలు…