సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సర్వం సిద్దమైంది. ఈ నెల 9వ తేదీన సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సోమవారం సాయంత్రం 6:05 నిమిషాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నట్లు గత శనివారంమే సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వు జారీ చేశారు.
అన్ని విభాగాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నత అధికారులు, అధికారులు, వర్కింగ్ స్టాఫ్,కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవిష్కరణ వేడుకలకు హాజరు కావాలని ఆమె ఆదేశాలు జారీచేశారు. కాగా లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు ప్రకటించారు.