హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
అలయ్ బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ ఏటా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి దత్తాత్రేయ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13న నాంపల్లిఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం ఏర్పాట్లపై కమిటీతో చర్చించి పలు సూచనలు చేసినట్లు చెప్పారు.
అలయ్ బలయ్ రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ఈ కార్యక్రమం 19వ వసంతంలోకి అడుగుపెడుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలను ఒక వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా అలయ్ బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. అలయ్ బలయ్ అనేది ఆత్మీయ సమ్మేళనం. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించేదే అలయ్ బలయ్ అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.