ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు లేవు

– 80శాతం ధాన్యం కుప్పలు పేరుకున్నాయి
– బీజేపీ భరోసా యాత్రలో అసలు విషయాలు గమనించాం
– సిఎం రేవంత్ కు అధికారులపై పట్టు లేదన్న ఏలేటి

హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 29: రాష్ట్రంలో రైతాంగం పడుతున్న బాధలు తెలుసుకునేందుకు ‘రైతు గోస – బీజేపీ భరోసా’ పేరుతో యాత్ర చేపట్టామని అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నాలుగు రోజుల పా టు అనేక జిల్లాల్లో పర్యటించి.. రైతాంగం ఆర్తనాదాలు విన్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు 80 శాతం పూర్తి అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పా రని.. కానీ తాము చేసిన ఈ యాత్రలో 80 శాతం ధాన్యం కుప్పలు పేరుకుపోయి కనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పోరాటం చేయగానే.. ప్రభుత్వం సమీక్షలు, జిల్లాల్లో కల్లాల బాట పడు తుందని ఆరోపించారు. ఇవే సమీక్షలు, పర్యటనలు మంత్రులు ముందే చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడ్మి నిస్ట్రేషన్పై కంట్రోల్ లేదని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడి రాజ్యం నడుస్తోందని విమర్శించారు. రైతుల వద్ద ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇసుక, సిమెంట్ లారీలను ముందే ఆపి ధాన్యం సేకరణ ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులే గన్నీ బ్యాగులు కొనే పరిస్థితి లేదన్నారు. లారీ, హామాలీల ఖర్చు రైతులే చెల్లిస్తు న్నారని తద్వారా రైతాంగం శ్రమను ఈ విధంగా దోపిడీ చేస్తున్నారని చెప్పారు. చివరి గింజ వరకు కొనే బాధ్యత నాదని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు చేతకాకపోతే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోమ్మని గత సీఎం కేసీఆర్ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎందుకు కొనుగోలు చేయడం లేదని సందేహం వ్యక్తం చేశారు. గ్దదెనెక్కగానే రేవంత్ రెడ్డి గద్దలా మారిపోయారంటూ తెలం గాణ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. వోటు బ్యాంకు కోసమే రైతులను వాడు కుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన యూరియాను కూడా సక్రమంగా ఇవ్వకుండా యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *