చర్లపల్లి జైలుకు భగీరథ్ తరలింపు

హైదరాబాద్,ప్రజాతంత్ర, మే29: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ మూడు రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత పోలీసులు అత‌డిని మల్కాజిగిరి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రధానంగా బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్, స్నాప్ చాట్‌ లలో చాటింగ్ లకు సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వాటి ఆధారంగానే భగీరథ్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *