డెలివరీ సేవల పన్ను రేటుపై కమిటీ ఏర్పాటు చేయాలి

  • ఐజీఎస్టీ పునరుద్ధరణ పై న్యాయబద్ధమైన విధానం అనుసరించాలి
  • ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే ఉంచాలి
  • జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రతిపాదనలు.. ఆమోదించిన కౌన్సిల్

జైపూర్, డిసెంబర్ 21: రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ  సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పలు ప్రతిపాదనలు చేయగా జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

సమావేశంలోని ప్రధాన అంశాలు:

1. డెలివరీ సేవల పన్ను రేటుపై చర్చలో భాగంగా రెస్టారెంట్ సేవలు, ఇతర డెలివరీ సేవలను ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ల ద్వారా అందించడంపై పన్ను రేటు గురించి చర్చ జరిగింది. ఈ అంశం సాంకేతికంగా క్లిష్టమైనది, పన్ను అమలులో న్యాయం జరిగేందుకు ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. జీఎస్టీ  మండలి ఈ ప్రతిపాదనను ఆమోదించింది.

2. రాష్ట్ర వారీగా మరియు రంగాల వారీగా జీఎస్టీ ఆదాయ విశ్లేషణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్..  2019లో ఏర్పాటైన జీఎస్టీ ఆదాయ విశ్లేషణపై ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను కొనసాగించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించగా. ఈ ప్రతిపాదనను మండలి ఆమోదించింది.

3. అధిక  ఐజీఎస్టీ కేటాయింపుల పునరుద్ధరణపై చర్చ క్రమంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా కేటాయించిన ఐజీఎస్టీ  పునరుద్ధరణ విషయంలో న్యాయబద్ధమైన విధానం అనుసరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ పునరుద్ధరణ తదుపరి ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని ఆయన ప్రతిపాదించారు. మండలి ఈ ప్రతిపాదనను సైతం ఆమోదించింది.

4. అవియేషన్ టర్బైన్ ఫ్యూయల్  జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం పై చర్చ జరగగా అవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ను ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే ఉంచాలని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. రాష్ట్రాలకు తక్కువ ఆదాయ వనరులు ఉన్నందున ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు వివరించారు. ఈ ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది.

5. బీ2బీ(బిజినెస్ టు బిజినెస్) లావాదేవీలపై 1% సెస్ వేయాలని ఆంధ్ర ప్రదేశ్ కోరగా, వరదల వల్ల జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని అదే తరహా సౌకర్యాన్ని తెలంగాణకు కల్పించాలని డిప్యూటీ సీఎం కోరారు. ఈ అంశాన్నిగ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌నుకు అప్పగించామని మండలి తెలిపింది. సమావేశంలో రెవెన్యూ (కమర్షియల్ టాక్స్ అండ్  ఎక్సైజ్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page