– ఒడిశాలో విషాద ఘటన
భువనేశ్వర్, మే 26 : ఒడిశాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కలహండి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఊపిరాడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలోని గౌడ కర్లాంకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ తీయడానికి మే స్తి దిగాడు. సెంట్రింగ్ తీస్తున్న సమయంలో అది కూలిపోయింది. దీంతో మే స్తి అందులో చిక్కుకుపోయాడు. మే స్తిని కాపాడేందుకు మరో ఐదుగురు సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగారు. లోపలికి దిగిన ఆ ఐదుగురు కూడా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్థులు వెంటనే స్పందించి ఆరుగురిని వెలికి తీసి హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. చనిపోయిన వారిలో ముగ్గురు మే స్తిలు, ఒక కార్మికుడు, ఇంటి యజమాని, అతడి కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




