మళ్లీ జీఎస్టీ బాదుడు..

యూజ్డ్‌ కార్లపై జీఎస్టీ పెంపు!
పాత కార్ల అమ్మకాలపై 18శాతం జీఎస్టీ బాదుడు
పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లు..!
1,500 వరకు ఉన్న దుస్తులపై 5% జీఎస్టీ
 1,500 నుండి రూ.10,000 వరకు వస్త్రాలపై 18% జీఎస్టీ
10,000 కంటే ఎక్కువ విలువైన బట్టలపై 28% జీఎస్టీ
షూస్‌, వాచీలపై పన్ను రేటు 28%కి పెంచాలని సిఫార్సు
ప్యాకేజ్డ్‌ డ్రిరకింగ్‌ వాటర్‌ పై  5%కి జీఎస్టీ తగ్గించె యోచన
సైకిళ్లు, క్యాన్సర్‌ ఔషధాలపై జీఎస్టీ 5%కి తగ్గించాలని సిఫార్సు
ఈ ప్రొడక్టస్‌పై పన్నుల్లో మార్పులు
148 పదార్థాలపై ప్రతిపాదిత మార్పులు
పలు వస్తువులపై పెరగనున్న జీఎస్టీ
బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు..
2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ రూపకల్పన
రాజస్థాన్‌లో నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన సమావేశం

న్యూదిల్లీ , డిసెంబర్‌ 21: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో బీమా ఉత్పత్తులకు జీఎస్టీకి సంబంధించిన నిర్ణయంపై చర్చను వాయిదా వేశారు. అనంతరం పన్నుల ఫ్రేమ్‌ వర్క్‌కు పలు అప్‌ డేట్స్‌ ను ప్రవేశపెట్టారు. 55వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో వివిధ రంగాలలో పన్ను రేట్లను సర్దుబాటు చేశారు.  యూజ్డ్‌ కార్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలపై చిన్న పెట్రోల్‌/డీజిల్‌ వాహనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలతో  సహా పాత, ఉపయోగించిన కార్ల అమ్మకాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది  ఉప్పు, మసాలాలతో కూడిన పాప్‌ కార్న్‌ (అన్‌ ప్యాకేజ్డ్‌ అయితే) 5% జీఎస్టీని, ప్రీ-ప్యాకేజ్డ్‌ పాప్‌ కార్న్‌ పై 12% జీఎస్టీ, క్యారమెల్‌-కోటెడ్‌ పాప్‌ కార్న్‌ పై 18% పన్ను విధించాలని నిర్ణయించారు. ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ తుది వినియోగంతో సంబంధం లేకుండా జీఎస్టీ రేటును మునుపటి 18% నుండి 5% కు తగ్గించారు. ఆటోక్లేవ్డ్‌ ఏరేటెడ్‌ కాంక్రీట్‌ (ఎసిసి) బ్లాక్స్పై: 50% కంటే ఎక్కువ ఫ్లై యాష్‌ ఉన్న ఏసీసీ బ్లాకులపై ఇప్పుడు జీఎస్టీ ని 18% నుండి 12 శాతానికి తగ్గించారు.

 

వివిధ వస్తువులపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించాలని ంవీ సిఫార్సు చేసింది. హానికరమైన పానీయాలు, పొగాకు ఉత్పత్తులపై పన్ను రేటును 28% నుంచి 35%కి పెంచాలని ప్రతిపాదించింది. అదే విధంగా దుస్తులపై ప్రతిపాదిత కొత్త రేట్లు ఈ కింది విధంగా ఉండనున్నాయి. రూ. 1,500 వరకు ఉన్న దుస్తులపై 5% జీఎస్టీ, రూ.1,500 నుండి రూ.10,000 వరకు వస్త్రాలపై 18% జీఎస్టీ, రూ.10,000 కంటే ఎక్కువ విలువైన బట్టలపై 28% జీఎస్టీ, రూ.1,500 పైబడిన షూస్‌, రూ.25,000 పైబడిన వాచీలపై పన్ను రేటును 18% నుంచి 28%కి పెంచాలని సిఫార్సు చేసింది. నిత్యావసర వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించాలని కూడా జిఓఎం సిఫార్సు చేసింది. ప్యాకేజ్డ్‌ డ్రిరకింగ్‌ వాటర్‌ (20 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ)పై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించాలని ప్రతిపాదించారు. అదనంగా, రూ. 10,000 కంటే తక్కువ ఉన్న సైకిళ్లు, క్యాన్సర్‌ ఔషధాలపై జీఎస్టీ రేట్లను 12% నుండి 5%కి తగ్గించాలని సిఫార్సు చేసింది. విటమిన్లు, మినరల్స్‌ యాడ్‌ చేసిన బలవర్ధకమైన బియ్యం పై పన్ను రేటును 5 శాతానికి తగ్గించారు. తుది వినియోగంతో సంబంధం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. స్విగ్గీ , జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై పన్ను భారం తగ్గించారు, దీనివల్ల ప్రజలకు మరింత తక్కువ ధరలో ఆహార పదార్థాలు అందుబాటులోకి వొస్తాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని (ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌తో కూడిన) 5 శాతానికి (ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లేకుండా) తగ్గించేందుకు ఫిట్‌మెంట్‌ కమిటీ ప్రతిపాదించింది. దీనిపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది.  రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ అధ్యక్షతన, 55వ వస్తు సేవల పన్ను మండలి   సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

బ్లాక్‌లు, బలవర్ధకమైన బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌), ఫ్లేవర్డ్‌ పాప్‌కార్న్‌ వంటివాటిపై మొదట నిర్ణయాలు వెలువడ్డాయి. 50% కంటే ఎక్కువ ఫ్లై యాష్‌ కంటెంట్‌ ఉన్న ఆటోక్లేవ్డ్‌ ఎరేటెడ్‌ కాంక్రీట్‌  బ్లాక్‌లపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌  సహా పాత  ఉపయోగించిన కార్ల విక్రయాలపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడానికి కౌన్సిల్‌ సభ్యులు ఆమోదం తెలిపారు.  విటమిన్లు, మినరల్స్‌ యాడ్‌ చేసిన బలవర్ధకమైన బియ్యంపై పన్ను రేటును 5 శాతానికి తగ్గించారు. తుది వినియోగంతో సంబంధం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెడీ-టు-ఈట్‌ పాప్‌కార్న్‌పై పన్నును కూడా కౌన్సిల్‌ సవరించింది. నాన్‌కీన్‌ల తరహాలో ఉప్పు, మసాలాలు కలిపిన పాప్‌కార్న్‌ను ప్యాకింగ్‌  – లేబుల్‌ లేకుండా సరఫరా చేస్తే 5 శాతం చెల్లించాలి. అదే ఫుడ్‌ను ప్యాక్‌ చేసి లేబుల్‌తో సరఫరా చేస్తే 12 శాతం కట్టాలి. పంచదారతో కలిపిన పాప్‌కార్న్‌, కారామెల్‌ పాప్‌కార్న్‌లో ఉపయోగించే చక్కెర వల్ల ఈ రకాలను మిఠాయి కిందకు తీసుకువచ్చారు, 18 శాతం విధించారు. స్విగ్గీ  జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై పన్ను భారం తగ్గించారు, దీనివల్ల ప్రజలకు మరింత తక్కువ ధరలో ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం (ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌తో కూడిన) 5 శాతానికి (ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లేకుండా) తగ్గించేందుకు ఫిట్‌మెంట్‌ కమిటీ ప్రతిపాదించింది. దీనిపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్న ‘బీమాపై పన్ను రేటు తగ్గింపు’ అంశాన్ని కౌన్సిల్‌ మరోమారు వాయిదా వేసింది, ప్రజలను నిరాశకు గురి చేసింది. ఈ అంశంపై మంత్రుల బృందం  భేటీలో ఏకాభిప్రాయం లేకపోవడంతో తదుపరి పరిశీలన కోసం బీమా అంశాలపై నిర్ణయాన్ని కౌన్సిల్‌ పోస్ట్‌పోన్‌ చేసింది.

 

వాస్తవానికి, టర్మ్‌ పాలసీలు సహా వయోజనలు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలపై టాక్స్‌ను రద్దు చేసేందుకు మంత్రుల బృందం  ఓకే చెప్పింది. సాధారణ ప్రజలు తీసుకునే రూ.5 లక్షల లోపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలపైనా జీఎస్టీని రద్దు చేయాలని, రూ.5 లక్షలు దాటిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని కొనసాగించాలని నిర్ణయించింది. దీనిపై కౌన్సిల్‌ మీటింగ్‌ ప్రారంభంలోనే చర్చ జరిగినప్పటికీ, మరింత లోతైన చర్చ కోసం వాయిదా వేసింది.  తి గడియారాలు, పెన్నులు, బూట్లు, దుస్తులు వంటి విలాసవంతమైన వస్తువులపై టాక్స్‌ పెంపు సహా 148 వస్తువులపై పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు చేశారు.   ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్న  జీఎస్టీ శ్లాబ్‌లతో పాటు 35 శాతం టాక్స్‌ స్లాబ్‌ను కూడా ప్రవేశపెట్టడం, హానికర ఉత్పత్తులకు  35 శాతం టాక్స్‌ స్లాబ్‌ను వర్తింపజేయడంపై చర్చించారు.   కూల్‌డ్రిరక్స్‌తో పాటు దుస్తులపైనా పన్ను రేట్లలో మార్పులు చేసే ప్రతిపాదన కౌన్సిల్‌ దగ్గర ఉంది. రూ.1500 వరకు ఉండే రెడీమేడ్‌ దుస్తులపై 5%, రూ.1500- 10,000 విలువైన దుస్తులపై 18%, రూ.10,000 కంటే ఎక్కువ ధర ఉన్న దుస్తులపై 28% జీఎస్‌టీ విధించాలని ప్రతిపాదనపై , గడియారాలు, పెన్నులు, బూట్లు, దుస్తులు వంటి విలాసవంతమైన వస్తువులపై టాక్స్‌ పెంపు సహా 148 వస్తువులపై పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు చేశారు.  ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్న శ్లాబ్‌లతో పాటు 35 శాతం టాక్స్‌ స్లాబ్‌ను కూడా ప్రవేశపెట్టడం, హానికర ఉత్పత్తులకు  35 శాతం టాక్స్‌ స్లాబ్‌ను వర్తింపజేయడంపై,  కూల్‌డ్రిరక్స్‌తో పాటు దుస్తులపైనా పన్ను రేట్లలో మార్పులు చేసే ప్రతిపాదన కౌన్సిల్‌ దగ్గర ఉంది. రూ.1500 వరకు ఉండే రెడీమేడ్‌ దుస్తులపై 5%, రూ.1500- 10,000 విలువైన దుస్తులపై 18%, రూ.10,000 కంటే ఎక్కువ ధర ఉన్న దుస్తులపై 28% జీఎస్‌టీ విధించాలని ప్రతిపాదన చేశారు.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరితో పాటు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు  అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రుల బృందం మధ్య చర్చల తరువాత మరింత సమీక్ష అవసరమని పేర్కొంటూ బీమా  సంబంధిత జిఎస్టి మార్పులకు సంబంధించిన నిర్ణయాలను వాయిదా వేయాలని కౌన్సిల్‌ నిర్ణయించినట్లు వివిధ మీడియా నివేదికలు తెలిపాయి. దీనిపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కొందరు సభ్యులు చెప్పారు. మేము  జనవరిలో మళ్లీ సమావేశమవుతాము’’ అని బీమాపై జివోఎంకు నేతృత్వం వహిస్తున్న బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి చెప్పారు. శనివారం జరిగిన 55వ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను రేట్లను తగ్గించే నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ వాయిదా వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరిన్ని సాంకేతిక చర్చలు అవసరమని కౌన్సిల్‌ సభ్యులు అంగీకరించారు. దీనిపై అదనపు చర్చల కోసం మంత్రుల బృందం ను నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page