– ఇరాన్‌తో చర్చలపై తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్, మే 26 : అమెరికా`ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో అణు కార్యక్రమం కీలకాంశంగా మారింది. శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా అందుకు ఇరాన్ పూర్తిగా అంగీకరించడం లేదు. తాజాగా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలని, లేదంటే అంతర్జాతీయ పర్యవేక్షణలో పూర్తిగా ధ్వంసం చేయాలని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమం ప్రపంచ దేశాలకు ముప్ప్పుగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక శుద్ధి చేసిన యురేనియం ద్వారా అణ్వాయుధాల తయారీ సాధ్యమవుతుందని, అందుకే దీనిపై కఠిన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. అమెరికా జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైతే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. కాగా, తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. తాము ఆణ్వాయుధం కోసం వెంపర్లాడడం లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. శుద్ధి చేసిన యురేనియంను నిర్వీర్యం చేసేందుకు అమెరికాకు అప్పగించకపోతే అటామిక్ ఎనర్జీ కమిషన్ లేక దాని సమానస్థాయి సంస్థ ఇరాన్‌తో సమన్వయం చేసుకొని ఒక ఆమోదయోగ్యమైన ప్రదేశంలో దానిని నాశనం చేయాలని ట్రంప్ తన ట్రూత్‌లో పోస్టు చేశారు. ఇదిలాఉంటే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 70కి పైగా హెజ్‌బొల్లా స్థావరాలను టార్గెట్ చేసింది. పది కమాండ్ సెంటర్లు సహా ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



