– తొమ్మిదేళ్లలో 16సార్లు పెరోల్ పై విడుదల
న్యూఢిల్లీ, మే 26 : తన శిష్యురాళ్లు ఇద్దరిపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా మరోసారి 30 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. హరియాణాలోని సునారియా జైలు నుంచి మంగళవారం బయటకు వచ్చారు. 2017లో శిక్ష పడిన తర్వాత ఆయనకు 16వసారి పెరోల్ లభించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శిక్ష అనుభవిస్తున్న గత తొమ్మిదేళ్లలో 400 రోజులకుపైగా అతడు జైలు బయటే గడిపాడు. ప్రస్తుత పెరోల్ కాలంలో డేరా బాబా సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలోనే ఉంటారని న్యాయవాది జితేందర్ ఖురానా తెలిపారు. 2002లో ఒక జర్నలిస్టు హత్య కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు డేరా బాబాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా ఏడేళ్ల జైలు జీవితం తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. ఆ తర్వాత తన శిష్యురాళ్లపై లైంగిక వేధింపుల కేసులో 2017లో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.గతంలో ఎన్నికల సమయాల్లో కూడా రామ్ రహీమ్‌కు పెరోల్ మంజూరు కావడం వివాదాస్పదమైంది. ప్రతిపక్ష పార్టీలు దీనిపై పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రామ్ రహీమ్ విడుదలయ్యే ప్రతిసారీ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి కూడా హరియాణా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




