సీజేపీపై అత్యసవర విచారణకు నిరాకరణ

– దీనిపై అంతగా భావోద్వేగానికి గురికావద్దు
– సుప్రీం ధర్మాసనం

న్యూఢిల్లీ, మే 25: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై అంత భావోద్వేగానికి గురికావద్దు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ న్యాయవాదులనుద్దేశించి అన్నారు. నిరుద్యోగులను సీజేఐ ఇటీవల కాక్రోచ్‌లతో పోల్చగా అది వివాదం కావడంతో వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వైరల్ అవడం తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి సంబంధించిన పిటిషన్‌ను అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే న్యాయవాదులు మాత్రం ఈ పిటిషన్ విచారణకు పట్టుబడుతుండడంతో న్యాయవాదులనుద్దేశించి సుప్రీం చీఫ్ జస్టిస్ పై విధంగా అన్నారు. కోర్టు పరిశీలనలను వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ ఓ పిల్ దాఖలైంది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రచారానికి సంబంధించి సీబీఐ విచారణ కోరుతూ మరొక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ రెండు పిల్‌లపై న్యాయవాదులు కోర్టు ముందు ప్రస్తావించగా ఈ పిటిషన్లను అంత అత్యవసరంగా విచారించాల్సిన ఆవశ్యకత ఏవిÖ లేదని, వాటిని తగిన సమయంలో పరిశీలిస్తామని సీజేఐ సూర్యకాంత్, జస్టిస్‌లు జయమల్య బాగ్చీ, వి.ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆన్‌లైన్ ఉద్యమం న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఎన్.కె.గోస్వామి అనే న్యాయవాది వాదించగా దానికంత భావోద్వేగానికి లోనుకావద్దు అని సీజేఐ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *