పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివద్ధే లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్ ను పార్లమెంటు ముందు ఉంచింది. వికసిత్ భారత్ దిశగా…… సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది. పదిరంగాలకు ఊతమిచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ప్రకటించింది. దేశంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు కొత్త పద్దులో మరింత ప్రాధాన్యం ఇచ్చింది. ఎమ్‌ఎ• •ఎమ్‌ఈ ఎగుమతులను….. రెట్టింపు చేస్తామని వెల్లడించింది. వేతన జీవులకు 12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపులు కల్పించింది. మొత్తంగా 50 లక్షలకుపైగా కోట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను కేంద్రం ప్రతిపాదిం చిందికేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది 8వ సారి. తద్వారా ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు.
‘ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన అభివృద్ధి చర్యలు పది విస్తృత రంగాల్లో ఉన్నాయి. పేదలు, యువత, అన్నదాత, మహిళలపై దృష్టిపెట్టినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘వ్యవసాయ అభివృద్ధి, దిగుబడి పెంపు, గ్రామాల్లో నిర్మాణాత్మక అభివృద్ధి, సమగ్రాభివృద్ధి పథంలోకి అందరినీ కలుపుకుని వెళ్లడం, మేకిన్ ఇండియాలో భాగంగా ఉత్పత్తి పెంపు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇలకు మద్దతు, ఉద్యోగాలు కల్పించే అభివృద్ధి, ప్రజా ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులు, ఇంధన సరఫరా పరిరక్షణ, ఎగుమతులకు ప్రోత్సాహం, ఆవిష్కరణలు పెంచి పోషించడం ఇందులో భాగం. ఈ అభివృద్ధి యాత్రలో వ్యవసాయం, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, పెట్టు బడులు, ఎగుమతులు మన శక్తివంతమైన ఇంజన్లు’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో 12 లక్షల రూపాయల్లోపు వార్షిక ఆదాయస్తులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం మధ్యతరగతి వర్గానికి భారీ ఊరటనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2025-26ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, ప్రజల బడ్జెట్, సంస్కరణల బడ్జెట్ అని మోదీ వ్యాఖ్యాని ంచారు. ప్రతీ భారతీయుడి కలలను నెరవేర్చే ఈ పద్దు.. 140 కోట్లమంది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్నారు. ప్రతీసారి బడ్జెట్ ప్రభుత్వ కోషాగారాన్ని నింపడంపై దృష్టిసారిస్తే.. ఈసారి పద్దు మాత్రం ప్రజల జేబులను నింపడానికి, తద్వారా వారి పొదుపును పెంచడానికి ఉద్దేశించిందని మోదీ వివరించారు. ప్రజల పొదుపు, పెట్టుబడులకు ఊత మిస్తుందని పేర్కొన్నారు. పర్యాటకం, మౌలికవసతుల అభివృద్దికి బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌ను ఈ పన్ను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఐతే తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించే చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ పై ఆయన స్పందిస్తూ.. నిధుల కేటాయింపులో వివక్ష చూపిందని, రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ 2025-26 మళ్లీ ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. ఈ బడ్జెట్ రాష్ట్రాల ప్రత్యేక అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యతలను విస్మరించిందన్నారు.
కేంద్ర బడ్జెట్ 2025-26లో కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్‌లను పెంచడం ద్వారా రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఆదాయపు వాటాను మరింత తగ్గించింది. ఈ విధానం కేంద్రం-రాష్ట్రాల ఆర్థిక సంబంధాల్లో రాష్ట్రాల న్యాయమైన వాటాను దెబ్బతీసేలా ఉంది. కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర సహాయ పథకాలకు కేటాయింపు గతేడాది రూ. 4,15,356 కోట్ల నుంచి రూ. 5,41,850 కోట్లకు (30.5% వృద్ధి) పెంచబడింది. రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను పెంచాలనే రాష్ట్రాల డిమాండ్‌ను పరిగణించకుండా, సీఎస్‌ఎస్ పై ఆధారపడే విధానాన్ని మరింత పెంచడం ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి వివిధ పథకాల ద్వారా అధిక నిధులు కేటాయిం చబడినప్పటికీ, గతంలో ఆ రాష్ట్రం ఆదాయంలో ప్రాశస్త్యాన్ని చూపింది. ఆర్థిక లోటు అనుమతించిన పరిమితికి తక్కువగా ఉంది. అయితే, సమర్థవంతమైన వనరుల వినియోగ సామర్థ్యం ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం కేవలం తెలంగాణకే కాకుండా, దేశ అభివృద్ధికి కూడా నష్టం కలిగించే అంశమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాగు ప్రాజెక్టులను ప్రాధాన్యతగా భావిస్తూ నిరంతరం పనిచేస్తుంది. కానీ, ఈ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర సాగు ప్రాజెక్టులకు గణనీయమైన నిధులు కేటాయించలేదు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఈ బడ్జెట్ వైఫల్యం చెందింది. కేంద్రం వ్యవసాయ అభివృద్ధి గురించి గొప్పగా మాట్లా డుతున్నా, తెలంగాణ లోని సాగు ప్రాజెక్టులను పక్కన పెట్టడం దారుణ మని అన్నారు.
కేంద్ర బడ్జె ట్‌లో బీహార్‌లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమా నాశ్రయాల అభి వృద్ధికి నిధులు కేటాయించింది. అయితే, తెలంగాణలోని వరంగల్ విమానాశ్రయం అభివృద్ధికి ఎలాంటి ప్రస్తావన లేదు. హైదరాబాద్‌లో ఉన్న ఒకే ఒక ప్రధాన విమానాశ్రయంపై మోదీ సర్కారు ఆధారపడటం వల్ల రాష్ట్ర వృద్ధికి ఆటంకం కలుగుతోంది. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి ద్వారా ప్రాంతీయ సంయోగాన్ని మెరుగుపరచి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఏర్పడేది. తెలంగాణ, దేశంలో కృత్రిమ మేధస్సు రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఎన్‌విడియా, ఇంటెల్, అడోబ్ వంటి గ్లోబల్ సంస్థల భాగస్వామ్యంతో ‘‘తెలంగాణ ఎఐ మిషన్’’ (టి- ఎఐఎం) విజయవ ంతంగా అమల వుతోంది. అయితే, గతంలో కేంద్రం ప్రకటించిన 3 ఎఐ కేంద్రాల స్థాపనలో తెలంగాణను పూర్తిగా విస్మరించడం దారుణం. తాజా బడ్జెట్‌లో ప్రకటించిన ఏఐ కేంద్రాల ఎంపిక ప్రక్రియలో ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకం ప్రస్తావన లేదు..
ఈ బడ్జెట్ ప్రసంగంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రస్తావన లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 86,000 కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా ఖర్చుచేసిన రూ. 89,263 కోట్ల కంటే తక్కువ. ఇది గ్రామీణ ఉపాధి కల్పనను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ ‘గరీబ్, యువ, అన్నదాత, నారీ’ (పేదలు, యువత, రైతులు, మహిళలు) సంక్షే మాన్ని ముందుగానే హైలైట్ చేసినప్పటికీ, వారిని ప్రోత్స హించే ఎటు వంటి స్పష్ట మైన కార్యక్రమాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కార్యాచరణ పథకం లేకుండా ఇచ్చిన హామీలు ప్రజలకు ఒరిగేలా ఉండవు.
కాంగ్రెస్ ఏమందంటే?
మరోవైపు, కేంద్ర బడ్జెట్ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ చికిత్సలా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నడుమ దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఒక నమూనా మార్పు అవసరమని అన్నారు. కానీ ఆ విషయంలో ప్రభుత్వం వద్ద ఆలోచనలు కరవయ్యాయని విమర్శించారు.
కేంద్ర బడ్జెట్ 2025-26 మళ్లీ ఒకసారి రాష్ట్రాల హక్కులను విస్మరించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం సముచితంగా స్పందించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం…నయాపైసా కేటాయించకపోవడం బీజేపీ నిర్లక్షానికి నిదర్శనం పసుపు బోర్డుకు పంగనామం ములుగు గిరిజన సెంట్రల్ యునివర్సిటికీ ఎగనామం ఈ బడ్జెట్ లో కేటాయింపులు శూన్యం ఇద్దరు కేంద్ర మంత్రులున్నా స్వరాష్ట్రానికి నిధులు సున్నా ములుగు వర్సిటికి 211 ఎకరాలకు అప్పచెప్పినా.. భవనాల నిర్మాణాలను కేంద్రం నిధులు నిల్ విభజన హమీల అమలుకు గుండు సున్నా ఏపీకి 15 వేల కోట్లు, తెలంగాణకు వట్టి మాటలు ఏపీ వెనకబడిన జిల్లాలకు నిధులు మంజూరు, తెలంగాణకు మొండి చేయి పోలవరం నిర్మాణానికి వేల కోట్లు, తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులకు నయా పైసా లేదు
ఏపీకి ఇండస్ట్రీయల్ కారిడార్లు, తెలంగాణకు ప్రోత్సహకాలు కరువు కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ. 57 వేల కోట్లు, తెలంగాణకు రూ. 27 వేల కోట్లు మాత్రమే తెలంగాణలో ఐఐటీ, ఐఐఎం, నవోదయ, సైనిక్స్ స్కూల్స్ ఏర్పాటుకు నో పన్నుల రూపంలో తెలంగాణ కేంద్రానికి రూపాయి ఇస్తే.. తెలంగాణకు నిధుల రూపంలో తిరిగి వస్తుంది 42 పైసలే తెలంగాణకు చెందిన 48 పైసలను తన ఖాతాలో వేసుకుంటున్న కేంద్రం.. తెలంగాణ డిమాండ్లను మాత్రం బుట్టదాఖలు చేస్తోంది తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం కేంద్రం నుంచి తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు లేవు… అదనపు ప్రయో జనాలు లేవు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల మాటలు ఫుల్, నిధులు నిల్ బీజేపీ నేతలు కోతల రాయుల్లు, ది•ల్లీలో మాత్రం మొఖం చెల్లదు తెలంగాణ వోట్లు కావాలి.
కాని తెలంగాణ అభివృద్ది మాత్రం బీజేపీకి పట్టదు తెలంగాణ ద్రోహి బీజేపీ బీజేపీ కో బగావ్, తెలంగాణ కో బచావ్ ఎన్నికల బడ్జెట్… సామాన్యుల కలలను వంచించిన బడ్జెట్ పంట పెట్టుబడి సహాయం కోసం కిసాన్ సమ్మాన్ యోజన మొత్తాన్ని పెంచుతామని ప్రకటించి.. బడ్జెట్ లో మాత్రం పెంపు ప్రతిపాదన లేదు 60 ఏండ్లు దాటిన రైతులకు నెలవారి పించన్లు అంది స్తామని 6 ఏండ్ల కింద హమీ ఇచ్చిన కేంద్రం..ఈ ఏడాది బడ్జెట్ లో కూడా పించన్ల ప్రస్తావన చేయలేదు వ్యవసాయ రంగానికి గత ఏడాదితో పోలిస్తే నాలుగు వేల కోట్లు తగ్గించారు పంటల భీమా పథకాన్ని పాడేనెక్కించేలా నాలుగు వేల కోట్లు తగ్గించారు యూరియా సబ్సిడీలో వేయి కోట్లు కోత విధించారు ఇది సామాన్యుల బడ్జెట్ కాదు..సంపన్నుల బడ్జెట్ పేదలను కొట్టి పెద్దలకు పెట్టే బడ్జెట్ అని కాంగ్రెస్ నాయకుల నిరసన వ్యక్తం చేస్తున్నారు
– డా : కృష్ణ సామల్ల (MCJ,M.Phil,Ph.D)
,ప్రొఫెసర్ ,ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ 9705890045.