‌ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్16 :  ‌మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ ‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 319 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 50, మైనారిటీ వెల్ఫేర్‌ ‌కు సంబంధించి 61,  పంచాయత్‌ ‌రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 27, విద్యుత్‌ ‌శాఖ కు సంబంధించి 81, ఆరోగ్యశ్రీ కి సంబంధించి 21, ఇతర శాఖలకు సంబంధించి 79 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్‌ ‌కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *