మాజీ మావోయిస్టు నేత మహమ్మద్‌ హుస్సేన్‌ విడుదలకు కృషి చేద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, పౌరహక్కులకు పూర్తిభరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజాసంఘాలపై, ఆలోచనపరులపై, అక్రమంగా బనాయించిన కేసులను సమీక్షించి ఎత్తివేస్తామన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల వేదిక, ఒక వివరమైన నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, హోంశాఖకు అందజేసింది. ఎలక్షన్‌ కోడ్‌ ముగిసిన వెంటనే కేసులు సమీక్ష జరిపి ఎత్తివేసే ప్రక్రియ మొదలుపెడతాం అని అప్పుడు ప్రభుత్వ అధికార్లు అన్నారు. కాని ఇప్పటి వరకు కేసులు ఎత్తివేసే ప్రయత్నం ఏమీ మొదలు కాలేదు.

వారం రోజుల క్రితం జమ్మికుంట పట్టణంలో అరెస్టు చేసిన మాజీ మావోయిస్టు పార్టీ సభ్యుడు, సింగరేణి కార్మిక నేత మహమ్మద్‌ హుసేన్‌ విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ వ్యవహరించిన తీరు, తనకేమి సంబంధం లేనట్టుగా తెలంగాణలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పాలకులు నిశబ్దంగా ఉన్న వైనాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఆలోచించవలసి ఉంది. హుసేన్‌ గతంలో పీపుల్స్‌వార్‌ సభ్యుడు, దానికి అనుబంధంగా ఉన్న సింగరేణి కార్మిక సంఘంలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన చురుకైన కార్మికనాయకుడు. అజ్ఞాతంలో ఉండగా అరెస్టు కాబడి నాలుగు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి, పదకొండు సంవత్సరాల క్రితం చాలా నిజాయితీగా జనజీవన స్రవంతిలో కలిసి, మంచి మనిషిగా ప్రజల ఆధరాభిమానాలు సంపాధించాడు. జమ్మికుంటలో హుసేన్‌కు అన్ని వర్గాల ప్రజలతో ఆయన విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. ఆ పట్టణంలో ఎవరి ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా హుసేన్‌కు ఆహ్వానం ఉంటుంది. సంసారంలో కష్టాలు, కుటుంబాలలో తగాదాలు లాంటి అన్ని సమస్యల్లో పరిష్కారాల కోసం ఆయనను కోరుకుంటారు.ఆయనను అరెస్టు చేసి రామకృష్ణాపూర్‌ పోలీస్‌స్టేషన్ లో ఉంచినప్పుడు, రాజకీయాలకు, విశ్వాసాలకు, అభిప్రాయాలకు భిన్నంగా అన్ని వర్గాల ప్రజలు ఆయనను విడిచిపెట్టాలని పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా కూర్చొని ధర్నా చేసారు.
అయితే తెలంగాణ పోలీసులు మాత్రం ఇవేవీ చూడకుండా, ఎప్పటిలాగానే పచ్చి అబద్ధాలతో కథ అల్లి, ఆయన భుజానికి ఒక బ్యాగు తగిలించి, మావోయిస్టుసాహిత్యం పెట్టుకొని మావోయిస్టు పార్టీకోసం ప్రజలను సమీకరించే పనిలో ఉండగా చాకచక్యంగా పట్టుకున్నామని పత్రికా విలేఖర్ల సమావేశంలో
అయనకు ముసుగు తగిలించి, ప్రదర్శించి ప్రకటన చేసి, ఆయనపై కేసు నమోదు చేసారు.
ఇది రామకృష్ణాపూర్‌ పోలీసులు ఆలోచనతో మాత్రమే జరిగింది కాదు. ఆయన అరెస్టు అయినప్పుడు ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలన్ని ప్రకటనలిచ్చాయి. వాళ్ళ వాళ్ళ పరిచయాలను బట్టి అధికారంలో ఉన్న రాజకీయనాయకుల జోక్యాన్ని అభ్యర్తించారు. ఈ విషయంలో రాష్ట్ర హోంశాఖ, ఉన్నత నిఘా వర్గాలలో చర్చ జరిగి ఉంటుంది. ముఖ్యమంత్రి సలహాదార్లకు కూడా ఈ విషయం తెలి
సే ఉంటుంది. అయితే పోలీసు అధికార్లకు సలహా ఇవ్వకూడదని అనుకున్నట్టుంది.
దాదాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గుగనులు తెలంగాణ పేద గ్రామస్తులకు వరంలాంటిది. కేంద్రప్రభుత్వం దేశంలోని చాలా ప్రభుత్వ సంస్థలకు అమ్మివేస్తున్నట్టే, సింగరేణి బొగ్గుగనులకు కూడా ఆక్షన్‌ చేసి ప్రయివేటు వాళ్ల చేతుల్లో పెట్టే ఆలోచనల్లో ఉంది. దేశంలో ఇంకా ఏడు రాష్ట్రాలలో ఉన్న బొగ్గుగనులను కూడా అమ్మే ప్రయత్నంలో ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో సింగరేణి సంక్షోభానికి గురైంది. కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అక్కడక్కడ నిరసనలు కూడా ప్రారంభం అయినాయి. సింగరేణిని ప్రయివేటు పరంచేస్తే తమ బతుకులు ఏమవుతాయే అనే ఆందోళన కార్మికవర్గం ఆలోచనల్లో తలెత్తింది.
సింగరేణి పబ్లిక్‌ సెక్టర్‌లో ఎక్కువ శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికే ఉంది. రకరకాల కారణాలవల్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోలేకపోతుంది. చిన్న చిన్న నిరసనలు ఉద్యమంగా మారుతాయేమో అనే భయం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అందువల్లే ఎటువంటి నిరసన వాతావరణం తలెత్తకూడదని హుస్సేన్‌ను అదుపులోకి తీసుకొని ఒక కథ అల్లారు. దీనితో సింగరేణి ప్రాంతంలో కార్మికుల భయపడి, కార్మిక సమీకరణకు వెనుకాడతారని కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వంతపాడుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, పౌరహక్కులకు పూర్తిభరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజాసంఘాలపై, ఆలోచనపరులపై, అక్రమంగా బనాయించిన కేసులను సమీక్షించి ఎత్తివేస్తామన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల వేదిక, ఒక వివరమైన నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, హోంశాఖకు అందజేసింది. ఎలక్షన్‌ కోడ్‌ ముగిసిన వెంటనే కేసులు సమీక్ష జరిపి ఎత్తివేసే ప్రక్రియ మొదలుపెడతాం అని అప్పుడు ప్రభుత్వ అధికార్లు అన్నారు. కాని ఇప్పటి వరకు కేసులు ఎత్తివేసే ప్రయత్నం ఏమీ మొదలు కాలేదు.
హుస్సేన్‌ చాలా బాధ్యత గల పౌరుడు. ఎవరిని కలిసినా దేశం లోని పరిస్థిపై చర్చిస్తుంటాడు. ప్రజాస్వామిక ఉద్యమాల ఆవశ్యకత గురించి చెప్పుతుంటాడు. వ్యాసాలు రాస్తుంటాడు. తన అనుభవాలు పుస్తకరూపంలో ముద్రించాడు. ఒకసారి హైదరాబాద్‌లో ఒక మిత్రుడి కూతురి వివాహంలో కలిసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పౌరహక్కుల, మానవ హక్కుల, ప్రజాస్వామిక ఉద్యమాలు బలపడటం చాలా అవసరం సార్‌ అన్నాడు. ఇటువంటి పౌరుడు స్వేచ్ఛగా తిరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదు.
గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి పౌర సమాజంలోని చాలా మంది వ్యక్తులు, సంస్థలు చాలా కృషి చేసాయి. ఇంకా ఆ సంస్థలు వ్యక్తులు ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగిస్తునే ఉన్నారు.ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చిహుస్సేన్‌పై కేసుఎత్తివేయించి ఆయనను విడుదల చేయించడం వాళ్ళ బాధ్యత. ఆ దిశగా ప్రజాస్వామిక వాదుల ప్రయత్నం జరగాలి. ముఖ్యమంత్రి హుస్సేన్‌ పై కేసు ఎత్తివేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం ప్రతిరోజు ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించే ముఖ్యమంత్రికి ఒక లిట్మస్‌ టెస్ట్‌, అట్లాకాకపోతే ఇప్పటి తెలంగాణలో కూడా పోలీసు పాలననే సాగుతుందని అనుకోవలసి వొస్తుంది.
`- ఎస్‌. జీవన్‌కుమార్‌
మానవ హక్కుల వేదిక.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *