సచివాలయంలో ఘనంగా బోనాల పండుగ

హాజరైన మంత్రులు పొన్నం, కొండా సురేఖ, సి.ఎస్‌ ‌శాంతి కుమారి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 25 :  డా.బీ.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌తెలంగాణా సచివాలయంలో బోనాల పండగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా సచివాల యంలోని నల్ల పోచమ్మకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లు పూజలు నిర్వహించారు. నల్ల పోచమ్మ అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌కొండా సురేఖ, సీ.ఎస్‌ ‌శాంతి కుమారి బోనం సమర్పించారు.

సచివాలయంలోని నల్ల పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల పండగలో సచివాలయంలోని అధికారుల స్థాయి నుండి అన్ని స్థాయిల సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పు విన్యాసాలు, పోతరాజుల ప్రదర్శ నల మధ్య పెద్ద ఎత్తున నిర్వహించిన ఊరేగింపులో పలు కళారూపాలకు చెందిన కళాకారులు పాల్గొ న్నారు. వీరితోపాటు, నగరంలోని పలు పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస రావు, మహిళా ఉపాధ్యక్షులు ఉమా నాగలక్ష్మి, చంద్రకళ,  ప్రధాన కార్యదర్శి జయహారి గౌడ్‌, ‌రామ్‌ ‌సింగ్‌, ‌యోగానంద్‌,‌జీ.ఎల్‌.ఎన్‌ ‌రాజు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *