ముచ్చర్లలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ

యువతకు నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యం
పలు కంపెనీల అవసరాల మేరకు శిక్షణ
బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిసామని మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : తెలంగాణలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా స్కిల్‌ డెవలప్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. నైపుణ్యం కలిగిన వారిగా తయారు చేసి, ప్రపంచంతో పోటీపడేలా చేయడమే దీని ఉద్దేశ్యమని అన్నారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో ఎందరికో స్కిల్స్‌ నేర్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.  బీజేపీ, ఎంఐఎం సభ్యులు మంచి సలహాలు ఇచ్చారంటూ.. విపక్షాలు సూచించిన సలహాలను స్వీకరించి మార్పులు చేస్తామన్నారు. మంచి ఆశయంతో స్కిల్‌ సెంటర్లను రూపొందిస్తామన్నారు. యువతను గొప్ప మానవ వనరులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఎస్సీ, ఎస్టీ యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. వ్యవసాయ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామన్న మంత్రి శ్రీధర్‌ బాబు… ప్రతి జిల్లాలో కూడా స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. వృత్తి పరంగా కూడా కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

నిరుద్యోగుల స్కిల్‌ ను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నైపుణ్యా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాదాపు 40 వేల ఉద్యోగాలను భర్తీచేశామన్నారు. ఈ మేరకు స్పీకర్‌ ముందు యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ బిల్లును శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడిరది. అతి త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.  శాసనసభలో ’యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2లక్షల ఉద్యోగాలు కల్పించినా.. మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయి. వారిలో స్కిల్స్‌ పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించాం. ’యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నాం. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్‌ కాంపోనెంట్‌ కలిగి ఉంటాయి. నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం. స్కిల్‌ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుంది. 2024`25 సంవత్సరంలో 2వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10వేల మందికి శిక్షణ ఇస్తాం. ముచ్చర్లలో స్కిల్‌ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయబోతున్నాం అని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page