మహారాష్ట్రకు భారీ వర్ష హెచ్చరిక

ఐఎండి హెచ్చరికలతో పూణెలో పాఠశాలల మూసివేతముంబయి,జూలై25: మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో భారత వాతావరణ శాఖ మహారాష్ట్రకు, పూణెలకు రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. ఐఎండి హెచ్చరికల మేరకు పూణెలోని పింపి, చించ్వాడ్‌, ‌భోర్‌, ‌వెల్హా, మావల్‌, ‌ముల్షీ, హవేలా, ఖడక్వాస్లా ప్రాంతాల్లోని పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రే ‌సుహాస్‌ ‌దివాస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలని ఆయన ప్రజలకు సూచించారు. గురు, శుక్రవారాల్లో ముంబై నగరంలోని శివారు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బృహన్‌ ‌ముంబై మెట్రోపాలిటన్‌ ‌కౌన్సిల్‌ (‌బిఎంసి) తెలపింది. ఇక జులై 24 ఉదయం 8 గంటల నుండి 25వ తేదీ ఉదయం 8 గంటలకు వరకు 44 మి. వర్షపాతం నమోదైంది. తూర్పు శివారు ప్రాంతాల్లో 90 మి., పశ్చిమ శివారు ప్రాంతాల్లో 88 మి. వర్షపాతం నమోదైందని బిఎంసి తెలిపింది. కాగా, పూణెలో బుధవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా ఏక్తా నగరి, విఠల్‌ ‌నగర్‌ ‌ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాల్లోకి నీరు చేరింది. దీంతో పూణె అగ్నిమాపక సిబ్బంది పడవల సహాయంతో ఇళ్లలోని ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో 40 క్యూసెక్కుల నీటిని ముఠా నదిలోకి పూనె అధికార యంత్రాంగం విడుదల చేసింది.
ఈరోజు ఉదయం నాలుగు గంటలకు 27203 క్యూసెక్కుల వేగంతో నీటిని విడుదల చేశారు. కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా ఈ నది ఒడ్డున నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాల్ఘర్‌, ‌రత్నగిరి, సింధుదుర్గ్ ‌దుగా గంటకు 50 నుండి 60 కి. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని జిల్లా సమాచార కార్యాలయం అంచనా వేసింది. అలాగే కొల్హాపూర్‌, ‌పూణెలోని ఘాట్‌ ‌ప్రాంతల్లోకూడా గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల కారణంగా ముంబైలోని అంధేరి సబ్‌వేపై రాకపోకలను అధికారులు మూసివేశారు. ముంబై మెట్రోపాలిటన్‌ ‌ప్రాంతం మొత్తానికి నీటిని సరఫరా చేసే 7 సరస్సుల్లో ఒకటైన విహార్‌ ‌సరస్సు ఈరోజు తెల్లవారుజామున 3.50 గంటలకు పొంగిపొర్లింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page