– ముస్లింలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక
లక్నో, మే 18 : రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేని అన్నారు. లఖ్‌నవూలో సోమవారంT జరిగిన ఒక కార్యక్రమంలో పైవిధంగా అన్నారు. ’రోడ్లు ఉన్నవి ప్రజల రాకపోకల కోసం.. వారికి అసౌకర్యం కలిగిస్తే ఊరుకోం.. ముస్లింలు జనాభాను నియంత్రించుకోవాలి’ అని అన్నారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లోని రోడ్లపై నమాజ్‌లు చేయరా అని తరచూ కొందరు నన్ను అడుగుతుంటారు.. అలాంటివి ఇక్కడుండవని చెబుతుంటాను.. కావాలంటే వెళ్లి చూసుకోమంటాను., రోడ్లున్నవి ప్రజా రవాణా కోసం. ఎవరైనా రోడ్ల కూడళ్ల వద్దకు వచ్చి ట్రాఫిక్‌ను దిగ్బంధించవచ్చా.. ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే హక్కు వారికి ఎవరిచ్చారు?. అని మరికొందరు అడుగుతుంటారు. తాము ఎక్కువమంది ఉన్నప్పుడు ఇలా నమాజ్ చేయకుండా ఉండటం సాధ్యం కాదు కదా అంటారు. దానికి మా సమాధానం ఒక్కటే.. మసీదుల్లో షిప్టుల ప్రకారం నమాజ్ చేసుకోండి.. ఇంట్లో జాగా లేకుంటే దానికి తగ్గట్టుగా జనాభా ఉండేలా చూసుకోండి.. జనాభాను పెంచుకోకండి.. చట్టం అందరికీ సమానమే.. ప్రభుత్వ నిబంధనలు కూడా చట్టంతో సమానం’ అని యోగి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం ’ఎక్స’లో ఆయన పోస్టు చేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా యోగి ఆదిత్యనాథ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్‌లను మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం అనుమతించడాన్ని తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలను టీఎంసీ తోసిపుచ్చింది. మైనారిటీలను యోగి ఆదిత్యనాథ్ బెదిరిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఇక కోర్టు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. రోడ్లపై నమాజుతో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని హెచ్చరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





