సింగరేణి కార్మికుల సంక్షేమ‌మే ధ్యేయం..

బోనస్‌ ‌చెక్కులు పంపిణీలో భట్టి విక్రమార్క
ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు
ఒప్పంద ఉద్యోగులకూ బోనస్‌
‌త్వరలో 1800కుపైగా ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపేర్కొన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ‌చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లు నమోదయ్యింది. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్‌ ‌ప్రకటిస్తున్నాన్నారు. సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటించాం. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు బోనస్ ‌వొస్తుంది. సింగరేణిలో శాశ్వత ఉద్యోగులు 41,837. సింగరేణిలో ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు.

సింగరేణి కార్మికులకు బోనస్‌ ‌చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రజాభవన్‌లో జరిగింది. కార్మికులకు రూ. 796 కోట్ల బోనస్‌ ‌చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు హాజరయ్యారు. 2023-24 సంవత్సరానికి సింగరేణికి రూ.2,412 కోట్ల లాభం వొచ్చింది. లాభాల్లో 33 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.9 లక్షలు రానుంది. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు సింగరేణి లాభాల్లో కార్మికులకు కోతపెట్టాయన్నారు. కార్మికులు సింగరేణి సంస్థకు ఆదాయం తీసుకువొస్తున్నారని అన్నారు.‘చెన్నూరు, రామగుండంలో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. 1800కుపైగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. గతంలో నియామక ప్ర‌క్రియలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పారదర్శకంగా ఉద్యోగ ఖాలీలు భర్తీ చేస్తాం‘ అని మంత్రి శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *