ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం
•మోమిన్ పేట మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
:తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: మోమిన్ పెట్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.గురువారం మోమిన్ పేట మండలంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సభాపతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్కతల ప్రాం తంలో 52 లక్షల వ్యయంతో నిర్మించిన 33/కెవి విద్యుత్తు ఉపకేంద్రం, అదనపు పవర్ ట్రాన్స్ ఫార్మర్‌ను సభాపతి ప్రారంభించారు. మోమిని పేట్ రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 64 మంది లబ్ధిదారులకు 66 లక్షల 73 వేల రూపాయల చెక్కులను అదేవిధంగా 25 మందికి ముఖ్య మంత్రి సహాయ నిధి కింద 10 లక్షల 73 వేల చెక్కులను ఆయన అందజేశారు.
అదే విధంగా చంద్రాయన్ పల్లి అంగన్వాడి, పూర్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు సభాపతి చేతుల మీదుగా ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. మొరం గపల్లిలో 15వ ఆర్థిక సంఘం, డిఎంఎఫ్టి లు సంయుక్తంగా 25 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉ• •కేంద్ర (పల్లేదవాఖాన) భవనాన్ని సభాపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వం ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందన్నారు. 266 కోట్ల నిధులతో పంచాయతీరాజ్,ఆర్ అండ్ బి, పంట పొలాలకు వెళ్లే రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. కల్కోడ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధితోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం గృహ ఆవాసాలకు అందించే సోలార్ ప్రాజెక్టుకు మోమిన్ పేటను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో భాగంగా చిన్న సన్న కారు రైతులను ఆదుకు నేందుకు అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీని వర్తింప చేస్తామని అదేవిధంగా రెండు విడతల రైతు భరోసా ఫై డిసెంబర్ 9న రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రకటించడం జరుగుతుందని, ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపా యలను చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి విద్యుత్ శాఖ ఎస్‌ఇ లీలావతి ఆర్ అండ్ బి ఇఇ శ్రీధర్ రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.