కరుణాకర్ లేరనే భావన బాధాకరం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : బీజేపీ సీనియర్ నాయకుడు జి.ఆర్.కరుణాకర్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ మలక్‌పేట్ నియోజకవర్గ కన్వీనర్ నుండి హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీలో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారన్నారు. పార్టీలో ఆయన అనేక బాధ్యతలు చేపట్టి క్రమశిక్షణతో కార్యకర్తలను ముందుకు తీసుకెళ్లేవారని గుర్తు చేశారు. తనకు ఆత్మీయులని, పార్టీ ఆవిర్భావం నుండి వారితో కలిసి పనిచేశానని, ఆయన సూచనలు సలహాలు తీసుకుంటూ పార్టీలో భాగస్వామ్యం అయ్యామని చెప్పారు. ఆయన లేరు అనే భావన చాలా బాధాకరంగా ఉందన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని, కరుణాకర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని రామచందర్ అన్నారు. కరుణాకర్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో నగర ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేశానన్నారు. పార్టీ అభివృద్ధిలో వారి పాత్ర స్పష్టంగా కనిపిస్తుందన్నారు. నగరంలో బీజేపీ విస్తరణలో వారి పాత్ర ప్రముఖమైనదని, కార్యాచరణ ప్రణాళిక కార్యకర్తలను ఉద్యమ పోరాటంలో నడిపించడంలో ముందుండేవారని కొనియాడారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి అని, వారి మరణం పార్టీకి తీరని లోట అని అన్నారు. కరుణాకర్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాననన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *