సింపుల్ ఈ-గవర్నెన్స్‌తో మెరుగైన సేవలు

– సీఎస్‌లకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ సోమనాథన్ ఆదేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టి.వి.సోమనాథన్ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న సింపుల్ ఈ-గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పాటించి ఆయా రాష్ట్రాలలో ఉన్న నిబంధనల మేరకు ప్రజలకు సరళతరమైన, మెరుగైన ప్రభుత్వ సేవలను అందించేందుకు ప్రయత్నించాలని సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఆయన సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్ విధానాన్ని వివరించారు. ప్రజలకు పాదర్శకంగా సులభతరమైన పౌర సేవలను అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు విభాగాల వారీగా ఆన్ లైన్‌లో డ్యాష్ బోర్డుల ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. మున్సిపల్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, రెవెన్యూ తదితర శాఖల్లో ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి తెలిపారు. ఈ-గవర్నెన్స్ విధానంపై సీఎస్ రామకృష్ణారావును కేబినెట్ సెక్రటరీ అభినందించారు. తమిళనాడు ప్రభుత్వ విధానాన్ని కూడా అధ్యయనం చేసి ప్రజలకు ఎలాంటి ఆర్థిక భారం, ఇతర ఇబ్బందులు కలగకుండా ఈ-గవర్నెన్స్ విధానాల్లో మార్పులు చేస్తామన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, షికా గోయల్, సెక్రటరీలు రఘునందన్ రావు, ఇ.శ్రీధర్, అనితా రామచంద్రన్, హౌసింగ్ ఎండీ వి.పి.గౌతం, సెర్ప్ సీఈవో దివ్య తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *