పెట్టుబ‌డుల‌కు కేరాఫ్‌గా తెలంగాణ‌

  • రాష్ట్రంలో పెట్టుబడుల‌కు అనుకూలమైన వాతావ‌ర‌ణం
  • హైద‌ర‌రాబాద్‌లో సానుకూల‌త‌ల‌ను వివ‌రించాలి.
  • మన‌ పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోంది..
  • ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
  • పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివద్ది పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని అన్నారు.
జూబ్లీహిల్స్ లోని నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జనవరి 20 నుంచి దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతి ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. గత ఏడాది ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్న ఏయే కంపెనీ లు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయి.. అవి ఏయే దశలో ఉన్నాయని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారిగా పెట్టుబడులు వొచ్చాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40232 కోట్ల పెట్టుబడులు వొచ్చాయి. 14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో దాదాపు 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగం పుంజుకున్నాయని, ఏడు ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉందని తెలిపారు. కంపెనీల వారీగా పురోగతిని మంత్రి శ్రీధర్ బాబుతో సీఎం చర్చించారు.
ఈ నెల 16 నుంచి సీఎవ విదేశీ ప‌ర్య‌ట‌న‌
ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు ముఖ్యమంత్రి దావోస్ లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటన లో ఉంటారు. సింగపూర్ లో స్కిల్ యానివర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరుపుతారు. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ ఆరు రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూలుతో పాటు, అక్కడ జరిగే సదస్సులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page