హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో దేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ గురువారం సమావేశమయ్యారు. నందినగర్‌లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, విద్యారంగంలో నూతన భాగస్వామ్యాల గురించి ప్రస్తావించారు. గతంలో పరిశ్రమలు , ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవమున్న కేటీఆర్ ఈ అంశంలో అనేక అంశాలపై చర్చించారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిపై తెలంగాణ-ఆస్ట్రేలియా మధ్య సహకారం భవిష్యత్తులో స్థానిక యువతకు మరిన్ని అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉన్న దృఢమైన మైత్రిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ఈ చర్చలు సాగాయి. ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన ఈ భేటీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈ భాగస్వామ్యం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు, సాంస్కృతిక బంధాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





