భద్రగిరి రామయ్యను దర్శించుకున్న తుమ్మల

– ఆలయ అభివృద్దికి ప్రత్యేక చొరవ

భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 14 : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రత్యేక స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా తొలిసారి ఎన్టీఆర్ కేబినెట్‌లో ప్రమాణ స్వీకారం చేసి నేటికి నలభై ఏళ్ళు పూర్తి అయ్యాయి. 1986 మే 14న తుమ్మల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దర్శనానంతరం తుమ్మల విÖడియాతో మాట్లాడుతూ శ్రీరాముడు అంటే భద్రాచలం అనేలా భక్త రామదాసు రామాలయం పునర్నిర్మాణం చేశారన్నారు. ఎన్టీఆర్ పాలనలో భద్రాచలం రామాలయం అభివృద్ధి చేసే భాగ్యం దక్కిందని తెలిపారు. రూ.351 కోట్లతో రామాలయం పునరాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు. నలబై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో భద్రాద్రి రాముని ఆశీస్సులు ఎప్ప్పుడూ ఉన్నాయన్నారు. భద్రాచలం ప్రాంతం నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *