తిరిగి 14న పాఠశాల పునఃప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : స్కూళ్లకు బుధవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా, 3 నుంచి సెలవులు ప్రకటించారు. తిరిగి 14న స్కూళ్లు తెరచుకోనున్నాయి. తెలంగాణ.. ఈ సంవత్సరంలో అత్యధికంగా ఈ నెలలోనే ఎక్కువ పండుగులు వొచ్చాయి. దసరా, దీపావళి పండుగలు ఒకే నెలలో రావడంతో విద్యార్ధులకు భారీగా సెలవులు లభించాయి. ఈ రెండు పండుగుల దృష్ట్యా అక్టోబర్ లో ఏకంగా స్కూల్స్ 16 రోజుల పాటు మూతపడనున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఏకంగా 13 రోజుల పాటు సర్కార్ దసరా సెలవులు ప్రకటించింది.
బతుకమ్మ సంబురాలు కూడా దసరా పండుగ ముందు ప్రారంభం కానున్నాయి. ఈ సంబురాలు మొత్తం 9 రోజులు ఉంటాయి. ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ 2న ఉండనుంది. ఆరోజు ఎలాగో గాంధీ జయంతి కాబట్టి.. పాఠశాలలకు అఫీషియల్ హాలిడే. అక్టోబర్ 31న దీపావళి పండుగ సందర్భంగా.. స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 20, 27 తేదీల్లో ఆదివారాలు కూడా కలిపి ఏకంగా ఈ నెల దాదాపుగా 16 రోజులు విద్యార్ధులకు సెలవులు ఉంటాయి. అంటే.. అక్టోబర్‌లో స్కూల్స్ పని చేసేది కేవలం 14 రోజులు మాత్రమే..