ఉగాది నుంచి పేదలకు సన్నబియ్యం

ఇది దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక నిర్ణయం
30
న సీఎం రేవంత్ రెడ్డి  పంపిణీ ప్రారంభం
రేషన్ షాపుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులు
నీటి పారుదలపౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి


రాష్ట్రంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని  నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గతంలో బియ్యం పంపిణీ లో చాలా లోపాలు ఉన్నాయని, రేషన్ షాపులలో ఇస్తున్న దొడ్డు బియ్యం 80 శాతం మంది లబ్ధిదారులకు ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. రూ.7, 8 వేల కోట్ల రూపాయల బియ్యం పంపిణీ జరిగితే లబ్దిదారులు వండుకోకపోవడంతో పక్కదారి పట్టిపోయాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్లో నిర్ణయం తీసుకొని.. పేదలు కడుపునిండా తినే విధంగా మంచి నాణ్యమైన ఫైన్ రకం బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకు వస్తున్నాం.  ఆహార భద్రత కోసం ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.. ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజక వర్గంలో ప్రారంభించాలి. రాష్ట్రంలో 84 శాతం మందికి మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా అందించబోతున్నాం.. ఇది స్వతంత్ర భారత దేశ చరిత్రలో విప్లవాత్మక కార్యక్రమం.

రాష్ట్రంలో సుమారు 89 లక్షల కార్డులు ఉన్నాయి. ఇటీవల జరిగిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో అదనపు సభ్యులను తీసుకున్నాం.. వారందరికీ బియ్యం అందిస్తాం.. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుంది. రేషన్ కార్డులు కొత్తవి వొచ్చే వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా బియ్యం అందిస్తాం..  రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా వారికి అందుబాటులో ఉన్న రేషన్ షాప్ లో బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం.. పేదలకు కడుపునిండా మంచి బియ్యం ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం..ఇటీవల రేషన్ డీలర్లకు కొంత కమిషన్ పెంచాం.. రేషన్ షాపుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page