దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బిఆరెఎస్‌ ‌నేతలు

మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం చేస్తున్నామని దుమ్మెత్తి పోస్తున్న భారాస నేతలు.. అప్పట్లో  రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన డియాతో మాట్లాడుతూ…కానీ కాంగ్రెస్‌ అలా చేయడం లేదన్నారు. మూసీ పరివాహకంలో ఏ ఒక్క పేదకు అన్యాయం జరగదని అన్నారు. అన్ని పార్టీల ఎన్నికల అజెండాలో మూసీ ప్రక్షాళన ఉంది.

మూసీ పరివాహకంలో ఇప్పటివరకు ఒక్క పేదవాడి ఇల్లు కూడా కూల్చలేదు. నది పక్కనున్న వ్యర్థాలను మాత్రమే తొలగించాం. దేశంలోనే అత్యంత కలుషితమైన నదిగా మూసీ నదికి పేరుంది. గడిచిన పదేళ్లలో 1500 చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఎక్కువశాతం చెరువులను బీఆర్‌ఎస్‌ ‌నేతలే కబ్జా చేశారు. అరగంట వాన పడితే హైదరాబాద్‌ ‌పరిస్థితి దారుణంగా తయారవుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి ఎంత మంది రైతులను పొట్టన పెట్టుకుందో అందరికీ తెలుసని మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. అలాంటి బిజెపి నేతలు రైతుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి రైతుల గురించి ఏం తెలుసున్నారు. ఇంతకన్నా దారుణం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *