మన సక్సెస్ స్టోరీని మనమే చెప్పుకోవాలి
•మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి
•టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పార్టీ కార్య క్రమాలు, ప్రభుత్వ నిర్ణ యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమా వేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్ వంటి గొప్పవారిని నియ మించడం హర్షణీయమని అన్నారు. ఎప్పటి కప్పుడు సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని, పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడినవారికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం.. సుదీర్ఘకా లంగా పని చేసినవారికి కొంతమందికి అవకా శాలు రాలేదు. వారిని కాపాడు కోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తాం. వివిధ జిల్లాల్లో ఖాలీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉంది. మార్చి 10 లోగా అన్ని జిల్లాల్లో నియామకాలు ఇచ్చేందు చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నాం.
పదవులు వొచ్చిన వారూ పార్టీ కోసం కష్టపడాలి పనితీరు సరిగా లేని వారికి రిన్యూవల్ ఉండదని స్పష్టం చేశారు. మంచిని మైక్ లో చెప్పండి..చెడును చెవిలో చెప్పాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. రూ.4200 కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచడంతోపాటు భూమిలేని పేదల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నాం. మన సక్సెస్ స్టోరీని మనమే చెప్పుకోవాలి. మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది.
పెద్ద పెద్ద విమర్శకులు కూడా మన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. దేశంలోనే అత్యధిక విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇది మన చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని, స్పోర్టస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. దేశానికి మేం ఒక కొత్త మోడల్ ను క్రియేట్ చేస్తున్నాం. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు మనమంతా కసితో పనిచేయాలి. మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి. రాహుల్ గాంధీ పట్టుదలతోనే కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయగలిగాం.
రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఇన్ని చేయగలిగితే%•% దేశంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తే ఇంకెన్ని చేయొచ్చు. దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ గ్రామగ్రామాన తిరుగుతున్నారు. అలాంటి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేవరకు విశ్రమించొద్దు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఎజెండాగా పనిచేయాలి అని సీఎం రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.