నాన్న అనే పదం రెండు అక్షరాలు
తన భాద్యతలు మాత్రం మోపెడు
తండ్రిగా, కొడుకుగా, భర్తగా అల్లుడిగా
తన భాద్యతలు నిర్వహిస్తున్నాడు….
మన పుట్టుకతో సంబురపడుతూ
గుండెలపై ఆడించిన రోజులు మధురం
నాన్న వేళ్ళు పట్టుకుని బుడి బుడి
అడుగులతో ప్రయాణము మొదలు పెట్టి
నాన్న భుజాలపై మొదటి సారిగా
ప్రపంచాన్ని చూసి…..
పోటీ ప్రపంచంలో తన రక్తాన్ని
ధారగా పోసి ఉన్నత చదువులు
చదివించి సమాజంలో మనకంటూ
ఒక గుర్తింపు తెస్తాడు నాన్న….
తన లక్ష్యాలు, ఆశయాలు పిల్లల
గెలుపులో చూసుకుంటాడు నాన్న…
సమాజంలో తన పాత్రను నిర్వహిస్తూ
సంపదకై సరైన మార్గంలో పని చేస్తూ
బంధు మిత్రులకు శ్రేయోభిలాషిగా
ఆత్మ బంధువుగా నిలుస్తున్నాడు నాన్న.
– మిద్దె సురేష్, కవి, వ్యాసకర్త
9701209355