సామాజిక అసమానతలు రూపుమాపడానికి గళమెత్తిన గద్దర్‌

ప్రజా వాగ్గేయ కారుడు, ప్రజా కవి, కళాకారుడు ప్రజా   యుద్ధ నౌక గద్దర్‌  తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయి పద్దెనిమిది నెలలయింది.  గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు,  మెదక్‌ జిల్లా తూఫ్రాన్‌కు చెందిన లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జనవరి 31న 1949లో ఆయన జన్మిం చారు.  దాదాపు అరవై  వసంతాలు పైగా  ప్రజలతో మమేకమై ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన మాట పాట ద్వారా ఊపిరి నింపిన విప్లవకారుడు. నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం, సాం స్కృతిక ఉద్యమం ఇలా అన్ని ఉద్యమాలలో  తన పాటలతో ప్రజా జీవితాలను ప్రభావితం చేశారు. ప్రభుత్వాలను కదిలించారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావ్‌ కొడకో  నైజాము సర్కరోడా  అని రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కొరకు గళమెత్తారు. 1980 లో చాల  ఇళ్లల్లో  భద్రం కొడుకో  నా కొడుకో కొమరన్న  పాట, మదన సుందరి, భారత దేశం భాగ్య సీమ రా సకల సంపదలు గల్ల దేశమున దరిదరమెట్లుందో నాయన, నీతి గల్ల మన దేశంలో న అవినీతేందుకు పెరిగిపోయార పాట.

చుండూరు దళితుల ఊచకోత వ్యతిరేకంగా, జ్ఞానం ఒక్కరి సొత్తు కాదన్న అది సర్వ జాతుల సంపదోరన్న, దళిత పులులమ్మా  అనే పాట   తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌ పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా..’ పాట ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. నిజామాబాద్‌, హైదరాబాద్‌లో గద్దర్‌ విద్యాభ్యాసం చేశారు. 1975లో కొద్ది కాలం  కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌ పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా.. పోరు తెలం గాణమా’ పాట ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమం అప్పటిదాకా ఒక ఎత్తు. ఆ పాట తర్వాత మరొక ఎత్తుగా కొనసాగింది. గద్దర్‌ ఆట పాట కోట్లాది మందిని కదిలించింది. ఉద్యమాన్ని ఉరకలెత్తి ంచింది. ‘అమ్మా తెలంగాణమా..’, ‘బండెనక బండి కట్టి..’, ‘భద్రం కొడుకో..’, ‘మదనాసుందరి’, ‘అడవి తల్లికి వందనం’ ఇలాంటి వందలాది పాటలతో ప్రభావం చూపారు. గద్దర్‌. జనం గోస తన పాటల ద్వారా వినిపించారు. గద్దర్‌ ఒక సంచలనం, గద్దర్‌ పిలుపు ఒక ప్రభంజనం, గద్దర్‌ పాట విని రోమాలు నిక్కబొడుచుకొని వారు ఉండరు. కొన్ని వేలమంది  ఉద్యమం బాట పట్టారు. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు’కు నంది అవార్డుకు ఎంపికయ్యారు గద్దర్‌. కానీ, నంది అవార్డును స్వీకరించేందుకు తిరస్కరించారు.

పీపుల్స్‌ వార్‌, మావోయిస్టు ఉద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో తన గొంతు వినిపించారు గద్దర్‌. తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు. దేశంలో  దళితుల హత్యలపై గద్దర్‌ అవి శ్రాంతంగా పోరాటం చేశా రు. నకిలీ ఎన్‌కౌ ంటర్ల ను తీవ్రంగా వ్యతి రేకిం చారు. అమర వీరుల కుటు ంబాల కు చేయూత నిచ్చేవారు. పీపుల్స్‌ వార్‌ పార్టీ క్యాడర్‌ రిక్రూట్మెంట్‌ తన పాటల ద్వారా ప్రభావితం అయ్యి ంది. చాలామంది  సానుభూ తిపరులు, పౌర ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, దళిత బహుజన సంఘాలలో సాంస్కృతిక విప్లవం తెచ్చిన వ్యక్తి.  అయన పాటలతో ఉత్తేజమై ఎందరో నక్సల్‌ ఉద్యమంలో చేరారు.  ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. నాడు మరణం అంచుల దాకా వెళ్లి, ప్రాణాలతో బయటపడ్డారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్‌ చురుగ్గా పాల్గొన్నారు. భావజాల వ్యాప్తి కోసం ఊరూరా తిరిగి బుర్రకథలతో ప్రచారం చేసేవారు. అలా ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి. నరసింగరావు.. భగత్‌ సింగ్‌ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి. నరసింగరావు ప్రోత్సాహంతో గద్దర్‌ ‘ఆపర రిక్షా’ పేరుతో తన మొదటి పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్‌. ఇదే ఆయన పేరుగా స్థిరపడిరది.

రాజ్యాంగ సంక్షోభానికి వ్యతిరేకంగా, సామాజిక తెలంగాణ స్వప్నం నెరవేరలేదని, ఎంతో కాలంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం కొందరి చేతుల్లో ఉందని వాపోయేవాడు.  తాను జీవించి ఉన్న  చివరి రోజులలో సామాజిక సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ, అణగారిన వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే అని గ్రహించి కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ పట్ల వల్లమాలిన అభిమానం. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీతో పాల్గొన్నారు, పౌర ప్రజా సంఘాలతో మమేకమై భారత్‌ బచావో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.   మణిపూర్‌ లో మహిళలను నగ్నంగా ఉరేగించినా, దిల్లీ లో  దేశానికి పతకాలు సాధించిన రేజిలర్లు పై లైంగిక వేధింపులు జరిగినా, బిల్కిస్‌ బానో రేప్‌ కేసులో నిందితులను క్షమాభిక్ష ప్రసాదించినా  మాకు  సంబందించిన విషయాలు కావని  మౌనం పాటిస్తున్న పార్టీలు   చివరికి  గద్దర్‌ ను భౌతికంగా  నిర్ములించేందుకు దాడులు జరిపిన పార్టీలు సైతం  గద్దర్‌ ని కొనియాడుతున్నారు.

అలాగే  ఒక విప్లవకారుడి  చివరి అంతిమ యాత్రలో  ప్రభుత్వ లాంఛనాలతో  పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అరుదైన వ్యక్తి గద్దర్‌.    ప్రాంతాల మధ్య అంతరాలను వెనుకుబాటు తనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. సమాజ పురోభివృద్ధికి ప్రతిబంధకాలు అవిద్య అజ్ఞానం మూఢనమ్మకాలు మతోన్మాదం  అశ్లీలత  అని భావించి  ప్రజలలో తన ఆట పాట ద్వారా ప్రజలను ఆలోచింప చేసి  భావ విప్లవం   తెచ్చిన మహానుభావుడు.   2023 జనవరిలో  రాయలసీమ ప్రజా సంఘాల వేదిక లో  ప్రసంగించారు. నీళ్లు నిధులు ప్రాంతీయ అసమానతలు తుదముట్టించడానికి లౌకిక ప్రజాతంత్ర ఉద్యమానికి బాసటగా నిలిచారు. రాయలసీమ పట్ల  ప్రత్యేక అభిమానం.  ముప్పై సంవత్సరాల క్రిందట మహాబోధి  విద్యాలయం ఏర్పాటు చేసి  ఎందరో విద్యార్థులకు విద్యా ప్రదానం చేశారు. పాఠశాలలో తల్లితండ్రులు కోల్పోయిన వారికి,  సింగిల్‌ పేరెంట్‌ పిల్లలకు ఉచిత విద్య అందించారు.  గుమ్మడి  చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో  ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు నేలపైన  ప్రజాకళలు ఉన్నంత  వరకు గద్దర్‌ పాట సజీవంగా ఉంటుంది.
` డా.జి. వెన్నెల గద్దర్‌,
చైర్‌ పర్సన్‌, తెలంగాణ సాంస్కృతిక సారధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page