ఏ. నాగాంజనేయులు

రేకుల షెడ్డు నీడలో
అందరికీ
ఉప్పునీటి స్నానాలే
*
చెట్టు చిన్నది
నీడ
ఎందరికో
*

image.png

కళ్ళజోడు పగిలింది
అక్షరాలు
దుఃఖించాయి
*
చీకట్లో
మిణుగురులు
కదిలే దీపాలు
*

image.png

చెట్టు ఒంటరి
పిల్లకారు లేక
పిల్లగాలి రాక
*

నది ఒడ్డున నావకు
అలల
జోలపాట
*

image.png

పూలకుండి

మా ఇంటి
ముఖచిత్రం
*
తేటగా ఉంది బావి
తొంగి చూసింది
నింగి
*
ఊర్లో అన్నదానం
ఆకలి మాత్రం
పొలిమేరలో
*

image.png

మూడురోజుల వాన
మూడుతరాలని మోసి
కూలింది గోడ

*

వానొచ్చి
వాడనంతా తడిపింది
పొద్దొచ్చి ఆరబెట్టింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *