ఒక గంపలో రెండు కత్తులు.
భక్తి – భయం తెగిపడ్డ నెత్తులు,
ఈ మతోన్మాద మోదంలో నువ్వు బలిపశువ్వి.
నిన్న వేరొకడు – నేడు నువ్వే,
నీ ప్రశ్నలంటే భయం వాడికి.
జవాబుల్లేని పేడ బుర్రవాడిది,
నీ విమర్శంటే ఒళ్లంతా వణుకే.
కర్షక శ్రమనెరుగని దోపిడీ దొంగే,
తర్కం లేని వాడి మొఖం చూడు!
సహజ మృగఛాయలలుముకున్న
మతోన్మాది వాడు!
-బాలాజీ పోతుల, 8179283830
నారాయణఖేడ్, సంగారెడ్డి.