హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హుస్నాబాద్ జిల్లల్లగడ్డలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైట్ చార్జీలు పెంచిన తర్వాత విద్యార్థులకు అందిస్తున్న మెనూ పాటించాలని,విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.. హాస్టల్ వాటర్ ప్లాంట్ పరిశీలించారు..ఎప్పటికప్పుడు ట్యాంక్ లు శుద్ధి చేయాలని ఆదేశించారు. పాఠశాల గ్రౌండ్ లో ఉపయోగపడే మొక్కలు నాటాలని మునగ, జామ, మామిడి, కూరగాయలు తదితర మొక్కలు నాటాలని ప్రిన్సిపాల్ ను మంత్రి ఆదేశించారు.