రేప‌టినుంచి సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్

– నెల రోజులపాటు 22 విభాగాల్లో ఓపీ సేవలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు నెల రోజులపాటు ట్రయల్ రన్ కొనసాగనుంది. ట్రయల్ రన్‌లో భాగంగా రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్, డయాగ్నసిస్ సేవలు అందించనున్నారు.  కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతోపాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్ రన్ జరగనుంది. ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని అధికారులు నియమించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *