మౌనమంటించిన
మనసుచితిలో
ఒక్క నిప్పురవ్వ
బతుకులో రాలి
గాలి కెరటాలకు
పగటి లోతుకు చేరి
కరిగిన క్షణాలది
అక్షరాలా మరణమే.
జీవమున్న జ్ఞాపకమే.
నిలువెత్తు నిజాన్ని
మింగేసిన ఆకాశంలో
మిగిలిన శూన్యంతో
పోరాడిన ప్రాణం
గెలుచిన కన్నీళ్ళ ఈతకు
ఊహకందడం లేదు ఒడ్డు.
– చందలూరి నారాయ