కూడికలు తీసివేతలు
కాదు జీవితం అంటే
భాగహారాలు గుణకారాలు
కూడా ఉంటాయి
ఏటిలో పుణ్యం కొరకు వేసె డబ్బును
లెక్కపెట్టి పెద్దలు వేయ మన్నారు
పుట్టుక నుండి చచ్చేదాక
లెక్కాపత్రం ఉంటుంది
లెక్కల్లో జాతక చక్రం
ముడిపడి ఉంటుంది…
నీరున్న తొట్టిలో నీరున్నంత వరకు
తొట్టి కలకల లాడుతుంది
నీరు తోడతుండాలి నింపుతు ఉండాలి
అలానే డబ్బు గురించి ఆలోచించాలి
ఖర్చులు పెరిగి సంపాదన తరిగితే
అప్పులే అప్పులు…
బారువడ్డి చక్రవడ్డికి నడ్డివిరిగి
ఊబిలో కూరుకో పోతే
ఆత్మహత్య లే కదా శరణ్యం …
ఒకటి కి వంద అంటే
అది నల్లడబ్బు కావచ్చు
జూదం కావచ్చు
ఆ సాలె గూడులో చిక్కితే
మరణమే కదా శరణ్యం…
పైస పైస పొదుపు చేస్తే
అవసరాలకు అది కల్పవక్షం
ఆనంద సంతోషాల ధామం
ఆశ దారి తప్పితే
కలలు భూస్థాపితం
కూడపెట్టింది చిలుం పట్టిందా
అది అన్యాక్రాంతం
– రేడియమ్, 9291527757