- రేవంత్ కు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర పయోజనాలు వద్దు..
- కాంగ్రెస్ ప్రభుత్వ అప్పును బీఆర్‌ఎస్ ఖాతాలో వేశారు.. మాజీమంత్రి హరీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని తేలిపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం మెదక్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడిమా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి 16 ఆర్థిక సంఘం వచ్చినప్పుడు సీఎం తప్పుదోవ పట్టించే యత్నంచేశారని ఆరోపించారు. రాష్ట్ర అప్పుల గురించి ప్రచార సభల్లో, ప్రభుత్వ వేదికలపై చివరకు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కూడా అవే అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందే అబద్ధాల పునాదుల మీద. అబద్దాలతో ప్రజలు నమ్మించి మాయమాటలు చెప్పి అధికారంలోకి వొచ్చాడని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి విస్మరించారని అన్నారు. డిసెంబర్ 9న నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వొచ్చి 10 నెలలు దాటినా రుణమాఫీ పూర్తి కాలేదు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో పాటు తులం బంగారం ఏదీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు లక్షల రూపాయల విద్య భరోసా కార్డు. రూ.4వేలు ఆసరా పింఛన్ ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు.





