హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23 : గవర్నర్ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. గత ఐదేళ్లలో అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గడువును ఈనెల 30వరకు పొడిగింది ంచింది. పర్యావరణ పరిరక్షణ విభాగం, దివ్యాంగుల సంక్షేమం విభాగం, క్రీడల విభాగం, సాంస్కృతిక విభాగం, వివిధ వర్గాల నుంచి అర్హులైన వ్యక్తులు, సంస్థలు తమ దరఖాస్తులనుగడువు లోపున సమర్పించవచ్చు. ప్రతి విభాగంలో రెండు కేటగిరీల అవార్డులు ఉంటాయి. ఒక కేటగిరీ వ్యక్తిగతంగా విజయం సాధించిన వ్యక్తుల కోసం, రెండవ కేటగిరి అయా విభాగాలలో అభివృద్ధి కోసం కృషి చేసిన సంస్థలు/సొసైటీలు/ట్రస్ట్‌ల కోసం కేటాయించారు. ప్రతి అవార్డు కింద రూ. 2,00,000/- (రెండు లక్షలు) నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేయ నున్నారు.
గత ఐదేళ్లుగా అంటే, 2019 సంవత్సరం నుంచి పైన తెలిపిన ఏదైనా విభాగాలలో స్వయంగా రాణించిన వ్యక్తులు లేదా సంబంధిత విభాగాలలో అభివృద్ధి చెందుటకు కృషి చేసిన వ్యక్తులు వ్యక్తిగత కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా గత ఐదేళ్లుగా అంటే, 2019 సంవత్సరం నుంచి పైన పేర్కొన్న విభాగాలలో అభివృద్ధికై అత్యుత్తమ అత్యంత విలువైన సహాయాన్ని అందించిన సంస్థలు/సొసై• •లు/ట్రస్ట్ లు సంస్థాగత కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. గవర్నరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ ద్వారా అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అవార్డుల కోసం ఎంపిక చేయనున్నారు.
ఈ విభాగాలలో ఖ్యాతిగాంచిన విశిష్ఠ వ్యక్తులు లేదా సంస్థలను ఇతరులు కూడా ప్రతిపాదించవచ్చును. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి. అవార్డు గ్రహీతలకు తెలంగాణ గవర్నర్ 26 జనవరి 2025న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు ప్రధానం చేసి సత్కరిస్తారు. ఆఫ్‌లైన్ సమర్పణల కోసం: తెలంగాణ రాజ్‌భవన్ వెబ్‌సైట్ https://governor.t elangana.gov.inలో అందుబాటులో ఉన్న నిర్దేశిత ఫార్మాట్ లను సక్రమంగా డౌన్‌లోడ్ చేసుకుని నామినేషన్ ఫారమ్‌లను పూరించి సమర్పించాలి. ఆన్‌లైన్ లో సమర్పించేందుకు దరఖాస్తుదారులు తెలంగాణ రాజ్ భవన్ వెబ్‌సైట్ https:// governor. telangana.gov.inని సందర్శి ంచాలి.