పల్లెల అభివృద్ధే లక్ష్యం

నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట
మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
రూ.40 కోట్లతో రోడ్లు, భవనాలు, వంతెనల నిర్మాణం
వైరా ఎమ్మెల్యే మాళోతు రాందాస్‌ ‌నాయక్‌

‌జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 23: ‌రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మారుమూల పల్లెల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాళోతు రాందాస్‌ ‌నాయక్‌ అన్నారు. పల్లెలు, పట్టణ ప్రజానీకంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాజకీయాలకతీతంగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. శనివారం ప్రజాతంత్ర విలేకరికి ఇచ్చిన ప్రత్యేక ఇంట ర్వ్యూలో  ఎమ్మెల్యే రాందాస్‌ ‌నాయక్‌ ‌నియోజకవర్గం లో చేపడుతున్న  అభివృద్ధి పనులు, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యాలను   వివరించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అంతర్గత రహదారులు, లింక్‌ ‌రోడ్లు, ఫార్మేషన్‌ ‌రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతు న్నాయని తెలిపారు. పంచాయతీరాజ్‌, ‌రహదారులు, భవనాలు, ఐటిడిఏ ఇంజనీరింగ్‌ ‌శాఖ పర్యవేక్షణలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.

జూలూరుపాడు మండలంలో వివిధ పథకాల కింద సుమారు రూ.40 కోట్ల మేర నిధులతో నిర్మాణాలు పురోగతిన ఉన్నాయని తెలిపారు. అనంతారం గ్రామం నుంచి అటవీ ప్రాంత ఆదివాసీ గ్రామమైన నల్లబండబోడుకు సుమారు 4 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకోవడం సంతోష కరంగా ఉందన్నారు. వందేళ్ళ క్రితం ఏర్పడిన నల్లబండబోడు గ్రామానికి సరైన రహదారి మార్గం లేకపోవడంతో ఇన్నేళ్లు వారు పడిన బాధలు వర్ణ ణాతీతం అని అన్నారు. తన హాయాంలో తారు రోడ్డు నిర్మాణం పూర్తికావటం సంతోషమన్నారు. రాజారావు పేట గ్రామం నుంచి వయా కేసుపల్లి మీదుగా ఏన్కూ రు మండలం బురదరాఘవాపురం వరకు ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.9 కోట్ల వ్యయంతో తారు రోడ్డు, వంతెనల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతు న్నాయని అన్నారు.

గిరిజన గ్రామమైన సూరారం సమీపంలోని రాళ్ల వాగుపై వంతెన నిర్మాణం కోసం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక దృష్టి సారించి వంతెన నిర్మాణం కోసం ఐటీడీఏ ద్వారా నిధుల మంజూరీకి కృషి చేయడం జరిగిందని తెలి పారు. ఈ పనులను కూడా త్వరలోనే ప్రారం భించడం జరుగుతుందని అన్నారు. కొత్తూరు గ్రామం నుంచి వినోబానగర్‌ ‌గ్రామం వరకు రూ. 4.50 కోట్లు సిఆర్‌ఆర్‌ ‌నిధులు, మాచినేనిపేట తండా నుంచి మాచినేనిపేట వరకు కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయని, ఈ విధులతో నూతనంగా తారు రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

వీటితోపాటు ఆర్‌అం‌డ్‌బి నిధులతో జూలూరుపాడు మండల కేంద్రం నుంచి పాపకొల్లు వరకు సైడ్‌ ‌డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతా యన్నారు. డిఎంఎఫ్‌ ‌టి, ఎంఎన్‌ఆర్‌ ‌జిఎస్‌ ‌పథకాల కింద కోటి నిధులు మంజూరయ్యాయని, పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధిలో భాగంగా సిమెంటు రోడ్ల నిర్మాణానికి కోటిన్నర నిధులు మంజూరయ్యాయని, మరో కోటి రూపాయలకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఎంఎన్‌ఆర్జిఎస్‌ ‌నిధులు రూ.60 లక్షలతో నూతనంగా గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. వీటితోపాటు రైతుల కోసం వ్యవసాయ భూములకు వెళ్లేందుకు అవసరమైన చోట్ల కొత్తగా రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page