– ప్రపంచ పటంలో పాక్ ఉండదు
– పాక్‌ను నేరుగా హెచ్చరించిన ఆర్మీ చీఫ్ ద్వివేది
– పాక్‌ను నేరుగా హెచ్చరించిన ఆర్మీ చీఫ్ ద్వివేది
న్యూదిల్లీ, మే 16: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు కొనసాగిస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్ తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మానేక్ షా సెంటర్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒకవేళ ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి దారి తీసిన పరిస్థితులు మళ్లీ వస్తే ఏం చేస్తారని ఆయన్ను ప్రశ్నించగా పాకిస్తాన్‌కు పై విధంగా వార్నింగ్ ఇచ్చారు. భారత్‌పై దాడులు చేసే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం ఆపాలన్నారు. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని, అందరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. అలాగే గతేడాది పహల్గాం దాడికి ప్రతిస్పందనగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి కూడా ద్వివేది మాట్లాడారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాల ఉనికిని ‘ఆపరేషన్ సిందూర’ ద్వారా ప్రపంచానికి తెలియజేశాం. ఉగ్ర స్థావరాలకు సంబంధించిన ఆధారాలు అందజేశాం. పాకిస్థాన్ ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలి. ఆపరేషన్ సిందూర్ రెండో వెర్షన్ మరింత తీవ్రస్థాయిలో ఉంటుంది అని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ పౌరుల రక్షణ, శ్రేయస్సు విషయంలో రాజీ పడదు.. తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే దీటుగా స్పందిస్తుంది’ అని ద్వివేది తేల్చి చెప్పారు. ఒకవేళ పాకిస్థాన్ ఉగ్రవాదులను పోషించి వాళ్లను ఇండియాపైకి ఉసిగొల్పితే అప్పుడు ఈ భూమ్మీద ఉండాలా లేదా అన్న అంశాన్ని వాళ్లే నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. చరిత్రలో ఆ దేశానికి స్థానం ఉండాలంటే ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వరాదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా నిలుస్తుందన్నారు. గత ఏడాది మే 7న పాక్‌పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.
—————————————————————————————————————————————————————-తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



