హైడ్రా ఆగదు అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు .హైడ్రా అంటేనే హరీష్, కేటీఆర్ బయటకు వస్తున్నారు..పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీలో మగ్గిపోతున్న వారికి ఇండ్లు ఇచ్చి, వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించాం.. మేం వారిని గుండెల్లో పెట్టుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు గుండెలు బాదుకుంటున్నారు. బిల్లా, రంగాలు వొచ్చి బుల్డోజర్లకు అడ్డుపడతామంటున్నారు. అక్కడికి ఇక్కడికి కాదు.. జన్వాడ ఫామ్ హౌస్ కు పోదాం పదా.. గుల్ఖాపూర్ నాలాను ఆక్రమించుకుని కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టలేదా? ఫామ్ హౌస్ కు బుల్డోజర్ వస్తుందనే ఇక్కడ వాళ్ల డ్రామాలు చేస్తున్నారు. అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
కాగా మాజీ మంత్రి హరీశ్ రావు పై సీఎం నిప్పులు చెరిగారు. నీలాంటి చెప్పులు మోసే వారు కాదు.. ఫామ్ హౌస్ లో పడుకున్న వాళ్లను రమ్మను నేను వస్తా.. నీదీ ఒక స్థాయేనా.. నా ఇంటి ముందుకు వొచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డ రోజులు మర్చిపోయావా? అని ప్రశ్నిచారు. ఫామ్ హౌసులు కాపాడుకునేందుకే బిల్లా, రంగాల దొంగ ఏడ్పులు అని సెటైర్లు వేశారు. మూసీ పునరుజ్జీవనం వేరు… హైడ్రా వేరు.. మూసీ లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. ట్రాఫిక్ సమస్య, నాలాల పునరుద్ధరణ, చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికే హైడ్రా పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.బీఆర్ఎస్ తాపత్రయం అంతా వాళ్ల ఆస్తులు కాపాడుకునేందుకేనని, అక్కడికి ఇక్కడికి కాదు…ఎప్పుడైనా ఫామ్ హౌస్ కు రమ్మని సవాల్ చేశారా? వాళ్ల ఫామ్ హౌస్ ల వద్దకు ఎప్పుడు రావాలో హరీష్ చెప్పాలని డిమాండ్ చేవారు. హరీశ్, కేటీఆర్ ఫామ్ హౌస్ ల విషయంపై అఖిలపక్షాన్ని పిలుద్దామని, నిజ నిర్ధారణ కమిటీతో నిజాలు నిగ్గు తేలుద్దామని ఆ తరువాత మూసీ దగ్గరకా.. ఇంకెక్కడికైనానా వెళదామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.





