- బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి
- సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమన్న సీఎం
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేలాలో గురువారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు యోగి సర్కార్ ఆదుకోవాలని సూచించారు. యూపీ సర్కార్ కోరితే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అవసరం అయిన సాయాన్ని అందజేస్తామని భరోసానిచ్చారు.