ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తక్షణ స్పందన
సహాయక చర్యలపై సిఎంతో ప్రధాని పలుమార్లు సమీక్ష
మహాకుంభ్ దుర్ఘటనపై ప్రధాని మోదీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణ సహాయక చర్యలకు ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోదీ ఇప్పటికే మూడు సార్లు యోగితో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. కుంభమేలా పరిస్థితి పై ప్రధాని మోదీ సమీక్షిస్తూనే ఉన్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. యూపీ ప్రభుత్వ అధికారులతో ఆయన టచ్‌లోనే ఉన్నారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలను ఆయన సూచించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా యూపీ సీఎంతో పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మహాకుంభమేళా లో తొక్కిసలాట జరగడంతో భక్తులకు యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. గంగామాతకు సమీపంలోని ఘాట్ వద్ద స్నానాలు చేయాలని సూచించారు. త్రివేణి సంగమం కేంద్రం వైపు వెళ్లి మొక్కులు చెల్లించడానికి ఎవరూ వెళ్లందంటూ భక్తులను కోరారు.
అమృత స్నానం కోసం చాలా ఘాట్‌లు ఏర్పాటు చేశామని, అక్కడ స్నానాలు చేయాలని కుంభమేళాలో ప్రచారం చేశారు. మౌని అమవాస్య సందర్భంగా యుపిలోని ప్రయాగ్ రాజ్ కు భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 20 మృతి చెందగా 50 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.