రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం సర్వే పూర్తి

29,82,034 నివాసాల సమాచరం కంప్యూటరీకరణ పూర్తి హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్27: సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే బుదవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయినట్లు స్పెషల్ కమిషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,18,02,726 నివాసాలు గుర్తించారు. బుదవారం నాటికి 1,10,98,360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తవగా కేవలం 7,04,366 నివాసాల సర్వే సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉంది. సేకరించిన వివరాలను అధికారులు కంప్యూటరీకరించడంలో పూర్తి జాగ్రత్తలు తీసుకొంటూ వేగవంతంగా సామాచారాన్ని కంప్యూటరీకరిస్తున్నారు.
ఈ ప్రక్రియనంతా సంబందిత ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అత్యధికంగా 70.3 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి మూలుగు జిల్లా మొదటి స్థానంలో నిలువగా, 59.8 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి యాదాద్రి భువణగిరి జిల్లా రెండవ స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు సేకరించిన సమాచారంలో 29,82,034 నివాసాల సర్వే సమాచారాన్ని కంప్యూటరీకరించారు.
జి.హెచ్.ఎంసీ పరిధి లో కూడా సర్వే ప్రక్రియ ఉపందుకుంది. 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా నేటి వరకు 20,15,965 నివాసాలలో సర్వే పూర్తి చేసి 80.5 శాతానికి చేరుకుంది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లో కంప్యూటరీకరణ ప్రక్రియ కొనసాగుతోంది సర్వే పత్రాలను సమగ్రంగా భద్ర పరచడమే కాకుండా తప్పులు లేకుండా ఆన్ లైన్ లో నమోదుకు చేసేందుకు పకడ్బంది చర్యలు చేపడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page