‌హైదరాబాద్‌ ‌లో ఐడిటిఆర్‌ ఏర్పాటు చేయండి..

ఆటోమేటిక్‌ ‌వెహికల్స్ ‌ఫిట్‌నెస్‌ ‌టెస్టింగ్‌ ‌స్టేషన్‌  ఏర్పాటుకు సహకరించాలి
రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయండి..
కేంద్ర మంత్రి గడ్కరీకి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌రాష్ట్రంలో రహదారుల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీసంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కోరారు.  కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీతో దిల్లీలోని ఆయన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి వద్ద  పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన్‌ ‌పోర్టల్‌కు, డ్రైవింగ్‌ ‌లైసెన్సులు సారథి పోర్టల్‌కు మార్చడం, వాహన స్క్రాపింగ్‌ ‌సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో చిల్డ్రన్‌ ‌ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ ‌పార్కుల ఏర్పాటు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటివ చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. రెండు రిజిస్టర్డ్ ‌వెహికల్‌ ‌స్క్రాపింగ్‌ ‌ఫెసిలిటీ  కేంద్రాలను ఇప్పటికే ఆమోదించామని, మరో 37 ఆటోమేటెడ్‌ ‌వెహికల్‌ ‌ఫిట్‌నెస్‌ ‌టెస్టింగ్‌ ‌స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి పరిపాలనా అనుమతి ఇచ్చామని వివరించారు.

ఎలక్ట్రిక్‌ ‌వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, తెలంగాణలో ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ‌ఫీజులను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల 40 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, అక్కడ దిల్లీలోని ఐడిటిఆర్‌ ‌తరహాలో 15వ ఫైనాన్స్ ‌కమిషన్‌ ‌కింద హైదరాబాద్‌ ‌మెట్రోపాలిటన్‌ ఏరియాలో డ్రైవర్లకు చాలా శిక్షణ అవసరం ఉన్నందున ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌డ్రైవింగ్‌ ‌ట్రైనింగ్‌ అం‌డ్‌ ‌రీసెర్చ్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కేంద్రమంత్రి ని కోరారు. మల్టీ-లేన్‌ ఆటోమేటిక్‌ ‌వెహికల్స్ ‌ఫిట్‌నెస్‌ ‌టెస్టింగ్‌ ‌స్టేషన్‌ను నిర్మించడానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రోడ్‌ ‌సేఫ్టీ కోసం పబ్లిక్‌ ‌వాహనాల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌ ‌ప్రాంతంలో ఎలక్ట్రానిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అమలు కోసం ఈ-చలాన్‌ల ఆటో జనరేషన్‌ ‌ద్వారా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను గుర్తించాలని కోరారు. వాహన్‌ %•% ‌సారథి సాఫ్ట్‌వేర్‌లకు బదిలీ చేయడం – డిపార్ట్‌మెంట్‌ ‌వాహనం డేటాను ఎన్‌ఐసీ నిర్వహించే నేషనల్‌ ‌రిజిస్టర్‌కి పోర్ట్ ‌చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఎన్‌ఐసీ ద్వారా వాహన్‌/‌సారథి అమలుకు అనుమతి ఇచ్చింది. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఉంచాలని ఎన్‌ఐసిని ఆదేశించవచ్చు, తద్వారా పోర్టింగ్‌ ‌వేగంగా డేటాను కోల్పోకుండా చేయవచ్చు.ఎంవీఐలు, ఏఎంవీఐలు నాణ్యమైన సాంకేతికంగా ఫీల్డ్ ‌శిక్షణ ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలి. అందుబాటులో ఉన్న 21 డ్రైవింగ్‌ ‌టెస్టింగ్‌ ‌ట్రాక్‌లను ఆటోమేట్‌ ‌గా మార్చడానికి సహకరించాలని కోరారు. పారదర్శకంగా సాంకేతికతతో నడిచే వేగవంతమైన పరీక్ష కోసం 21 డ్రైవింగ్‌ ‌టెస్టింగ్‌ ‌ట్రాక్స్ ఏర్పాటు చేయాలన్నారు.  అంతే కాకుండా తన నియోజకవర్గం హుస్నాబాద్‌ ‌లో పలు సింగిల్‌ ‌రోడ్లను డబుల్‌ ‌రోడ్లు గా విస్తరించేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కోరారు.సమావేశంలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌, ‌రఘురామ్‌ ‌రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, సురేష్‌ ‌షెట్కార్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page