పాఠకులని వెతుక్కుంటూ సాహిత్యం మారాలా? -బాలాజీ పోతుల

తాను రాసే రచనకు జనాదరణ పొందాలని కోరుకోని రచయిత ఉండరు. రచయిత రాసేది ఎవరైనా చదవాలనే. తన రచనను తానే చదువుకునే మొదటి పాఠకుడు / పాఠకురాలు కూడా రచయితే. అయితే ఒక రచనకు జనాదరణ రావడం అంటే కేవలం ఎక్కువమంది చదవడమేనా? ఎక్కువ ప్రతులు అమ్ముడవడం ఒక్కటే దాని సాహిత్య విలువకు కొలమానమా లేక…









